దాసరి మరణంపై కోడలి అనుమానం

దాసరి మరణంపై కోడలి అనుమానం

దర్శక రత్న దాసరి నారాయణరావు మృతితో సినీ పరిశ్రమతో పాటు సామాన్య ప్రేక్షక లోకమూ విషాదంలో ఉండగా.. అంతలోనే ఆయన కుటుంబంలో నెలకొన్న వివాదాలు తెరమీదికి రావడం విచారించాల్సిన విషయం.

దాసరి పెద్ద కోడలు సుశీల.. ఆయన చనిపోయిన కొన్ని గంటలకే మీడియా ముందుకొచ్చి ఆస్తి గొడవలపై మాట్లాడారు. దాసరి తనకు అన్యాయం చేసి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి మరణంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. దాసరి పెద్ద కొడుకు తారక ప్రభు భార్య సుశీల. ఆమెకు ఓ కొడుకున్నాడు. తన పేరు దాసరి నారాయణరావే. తారకప్రభుతో సుశీలకు ఎప్పట్నుంచో విభేదాలున్నాయి. గతంలో అతడిపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది సుశీల. ఆ తర్వాత ఆ వివాదం ఏమైందో ఎవ్వరికీ తెలియదు.

దాసరి మరణానంతరం కొడుకుతో కలిసి మీడియా ముందుకొచ్చిన సుశీల.. మే 4న తాను దాసరిని కలిసినట్లు చెప్పింది. తమకు ఇప్పటిదాకా ఆస్తిలో ఎలాంటి వాటా ఇవ్వలేదని.. ఇదే విషయాన్ని తన మామ దగ్గర ప్రస్తావించగా.. రెండు వారాల్లో తాను సర్జరీ చేసుకోవాల్సి ఉందని.. అదయ్యాక కొన్ని రోజుల్లో అంతా సెటిల్ చేస్తానని.. ఆస్తి పంపకాలు చేపడతానని అన్నట్లు సుశీల వెల్లడించింది.

తన కొడుకు దాసరి నారాయణరావు సినీ రంగ ప్రవేశం గురించి కూడా మాట్లాడానని.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన తాను.. తన మనవడిని చూసుకోనా అన్నారని.. అతడి బాధ్యత తాను తీసుకుంటానని.. సినిమాల్లోకి తీసుకొస్తానని దాసరి అన్నట్లుగా ఆమె తెలిపింది. ఇలా చెప్పిన ఆయన ఇంతలోనే వెళ్లిపోయారని.. రెండు రోజుల కిందట దాసరిని కలుద్దామని ఆసుపత్రికి వస్తే తనను లోపలికి వెళ్లనివ్వలేదని.. అందుకే ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ఆరోపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు