క్లిక్‌ అయితే బాహుబలి, లేదంటే బలి!

క్లిక్‌ అయితే బాహుబలి, లేదంటే బలి!

'బాహుబలి 2'పై హైప్‌ పతాక స్థాయిలో వుండడంతో కొన్ని ప్రాంతాల్లో ముందుగా ప్రదర్శించడం, మిగిలిన ప్రాంతాల్లో రెగ్యులర్‌ షోలు వేయడం సబబు కాదని అనుకున్నారు. అందుకే రిలీజ్‌కి ముందు రోజు రాత్రి అఫీషియల్‌గా రిలీజ్‌ చేసేసారు. దీంతో వేరే చోట్ల నుంచి టాక్‌ స్ప్రెడ్‌ అవడం, పైరసీ వీడియోలు లీక్‌ అవడం లాంటి సమస్యలని అధిగమించారు.

విడుదలకి ముందు రోజు రాత్రి వచ్చిన టాక్‌తో రిలీజ్‌ రోజు బాహుబలి మరింతగా విజృంభించింది. అసలే హైప్‌ మీద వున్న సినిమాకి టాక్‌ తోడవడంతో తొలి రోజు బాహుబలి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రిలీజ్‌కి ముందు వేసే ప్రీమియర్స్‌ వల్ల బాగున్న సినిమాకి ఎంత ప్లస్‌ అవుతుందనేది ఇంతకుముందు కూడా పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలో లో బడ్జెట్‌ సినిమా 'అంధగాడు'కి వివిధ ప్రాంతాల్లో పెయిడ్‌ ప్రీమియర్లు ప్లాన్‌ చేయడం నిర్మాతల ధైర్యాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తోంది.

సినిమా బాగుందనే టాక్‌ వస్తే ఈ ప్రీమియర్స్‌ వల్ల ఖచ్చితంగా లాభం వుంటుంది. కానీ టాక్‌ ఏమాత్రం తేడా వచ్చినా కానీ మొదటికే మోసం వస్తుంది. సినిమా చూడాలని అనుకున్న వాళ్లు కూడా చిన్న సినిమాకి టాక్‌ తేడాగా వస్తే వేరే ఆప్షన్‌ ఏదైనా వుందేమో అని చూసుకుంటారు. 'అంధగాడు' నిర్మాతలది అంధ విశ్వాసమో లేక నిజంగానే ఈ అంధగాడుకి అంత వుందో తెలియాలంటే గురువారం రాత్రి వరకు ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English