ఏపీని చూసి ఆశ్చర్యపోయారు.

ఏపీని చూసి ఆశ్చర్యపోయారు.

భారత్ లో మొదలైన డిజిటల్ విప్లవానికి కొత్త రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ సరికొత్త భాష్యం చెప్తోంది. ఏపీని డిజిటల్ రాష్ర్టంగా మార్చడంలో సీఎం చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమావేశంలో చంద్రబాబు ఐటీ సలహాదారు రిచా శ్రీవాత్సవ ఏపీ ప్రభుత్వం ఈ విషయం తీసుకుంటున్న చర్యలు... ముఖ్యంగా ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్సుల్లో అమలు చేస్తున్న విధానాలను వివరించారు.

టెక్నాలజీని ఉపయోగించిన ఏపీ ప్రజల రోజువారీ జీవితాన్ని సులభం చేసిన ఘనత చంద్రబాబుదేని రిచా వెల్లడించారు. రాష్ర్టంలో ప్రభుత్వం చేపడతున్న ప్రతి కార్యక్రమాన్ని రియల్ టైంలో మోనిటర్ చేయడానికి ఏర్పాటుచేసుకున్న సీఎం డ్యాష్ బోర్డును గురించి ఆమె ఆ సమావేశంలో ప్రత్యేకంగా వివరించారు. డ్యాష్ బోర్డు సహాయంతో ప్రతి రోజూ ఎన్ని వీధి దీపాలు ఆన్ అయ్యాయో కూడా చెప్పొచ్చని చెప్పడంతో మిగతా రాష్ట్రాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అదొక్కటే కాదు రోజుకు ఎంత కరెంటు ఉత్పత్తవుతుంది... ఎంత వినియోగం అవుతుంది.. జలాశయాల్లో నీటి మట్టాలు, వర్షాపతం, నీటి సరఫరా, ట్యాక్స్ రెవెన్యూ, చెట్లు నాటడం వంటి ప్రతి సమాచారం సీఎం డ్యాష్ బోర్డులో ఒక్క లుక్ లోనే తెలిసిపోతున్నాయి.

ఏపీలోని ప్రతి ఇంట్లో కనీసం ఒక ఈ-లిటరేట్, ఒక ఈ-ఎంటర్ ప్రెన్యూర్ ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమని.. ఆ దిశగా ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని రిచా చెప్పారు. మీసేవ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఆన్ లైన్లోనే పొందేందుకు వీలుందని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు