గూగుల్‌ ట్రెండ్స్‌ తో బాహుబలి పబ్లిసిటీ

గూగుల్‌ ట్రెండ్స్‌ తో బాహుబలి పబ్లిసిటీ

బాహుబలి రెండు భాగాలు కలిపితే ఇప్పటిదాకా రూ.2200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మిగతా మార్గాల్లో వచ్చిన ఆదాయం కూడా కలుపుకుంటే లెక్క రూ.3 వేల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదేమో. ఐతే ఈ స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టిన సినిమాను ప్రమోట్ చేయడానికి బాహుబలి టీం పెట్టిన ఖర్చు సున్నా.

ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ప్రకటన లేకుండా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లింది బాహుబలి బృందం. ఇది బిజినెస్ కాలేజీల్లో పాఠంగా పెట్టాల్సిన విషయం. కేవలం సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని.. మీడియా దృష్టిని తెలివిగా ఆకర్షించడం ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా సినిమాను అద్భుత రీతిలో ప్రమోట్ చేశారు. మరి ఈ విషయంలో బాహుబలి టీం ప్రణాళిక ఎలా సాగాయి.. ప్రమోషన్ కోసం వాళ్లేం చేశారు.. ఈ సంగతులు రాజమౌళి మాటల్లో తెలుసుకుందాం పదండి.

‘‘పబ్లిసిటీలో క్రియేటివ్‌ పార్ట్‌ చాలా ఉంది. ఎలా చేయాలి.. ఏం చేయాలి.. ఎప్పుడు చేయాలి.. అన్నది నిర్మాత శోభు చూసుకున్నాడు. బడ్జెట్‌ పెరిగిపోతోంది.. పెద్ద హిట్‌ అయినా డబ్బులు రావు.. మార్కెట్‌ పెంచుకుంటూ పోతే తప్ప అని భయపడ్డాం. మనం ఏదో ప్రత్యేకంగా చేస్తున్నామని ప్రేక్షకులకు చెప్పకపోతే క్యూరియాసిటీ పెరగదని భావించాం. ఫస్ట్‌పార్ట్‌ షూటింగ్ మధ్యలో ఉండగానే మేకింగ్‌ వీడియోలు రిలీజ్‌ చేశాం. ప్రభాస్‌, అనుష్క, రానా పుట్టిన రోజులకు వీడియోలు వదిలాం. వీటికి రెస్పాన్స్ ఎలా ఉందో గూగుల్‌ ట్రెండ్స్‌లో చూసుకున్నాం. ఎక్కడ జనాల నుంచి పెద్దగా స్పందన లేదో అక్కడ.. వాళ్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మా టీం సభ్యులూ పాల్గొన్నాం. చివరికి గూగుల్‌ ట్రెండ్స్‌లో చూస్తే షారుక్‌ ఖాన్‌ సినిమాకు ఎంత రెస్పాన్స్ ఉందో బాహుబలి కూడా అంతే ఉందని తేలింది. దీంతో మనం పబ్లిసిటీకి ఖర్చుపెట్టనక్కర్లేదని అర్థమైంది. ఒక్క పోస్టర్‌ కూడా లేకుండా ధైర్యంగా సినిమా రిలీజ్ చేశాం. సోషల్ మీడియా.. మిగతా మీడియా సినిమాకు క్రేజ్ తీసుకు రావడంలో బాగా ఉపయోగపడింది’’ అని రాజమౌళి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు