‘డీజే’తో ఇమేజే మారిపోయేలా ఉందే..

‘డీజే’తో ఇమేజే మారిపోయేలా ఉందే..

బాలీవుడ్ భామ పూజా హెగ్డేకు మొదట్నుంచి ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ఉంది. హిందీలో అయినా.. దక్షిణాదిన అయినా ఆమె మొదట్నుంచి ఆమె చేసిన క్యారెక్టర్లు అలాంటివి. తెలుగులో ఇంతకుముందు ఆమె చేసిన ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించింది.

ఆ సినిమాల్లో ఆమె గ్లామర్‌ను వాడుకునే ప్రయత్నమేదీ చేయలేదు దర్శకులు. ఐతే హీరోయిన్‌గా లాంగ్ రన్ కోరుకునే ఏ హీరోయిన్ కూడా ‘ట్రెడిషనల్’ ముద్రతో కొనసాగాలని అనుకోదు. గ్లామర్ యాంగిల్ చూపించకుంటే ఇక్కడ మనుగడ కష్టం. ముఖ్యంగా పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావాలంటే.. ఇమేజ్ మేకోవర్ జరగాల్సిందే.

‘దువ్వాడ జగన్నాథం’లో పూజా హెగ్డేకు అలాంటి మేకోవరే ఇచ్చినట్లున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోయిన్ల గ్లామర్ యాంగిల్ బాగా ఎలివేట్ చేస్తాడని.. ఎక్స్‌పోజింగ్‌ చేయించుకుండానే వాళ్లను సెక్సీగా చూపిస్తాడని హరీష్ శంకర్‌కు పేరుంది. ‘గబ్బర్ సింగ్’లో శ్రుతి హాసన్‌ను, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' లో రెజీనా కసాండ్రాను అలాగే చూపించి.. వాళ్ల ఇమేజ్ మార్చేశాడు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది.

నిన్న రిలీజైన ‘గుడిలో బడిలో మదిలో’ పాటలో పూజాను చూస్తే మతి పోవడం ఖాయం. ఇప్పటిదాకా కనిపించిన పూజా వేరు.. ఇందులో కనిపించిన పూజా వేరు. ఆమెను చాలా సెక్సీగా చూపించాడు హరీష్. ఆ డ్రెస్సులు.. ఆ స్టెప్పులు.. అన్నీ కూడా పూజాను సరికొత్తగా చూపించాయి. ‘డీజే’ కచ్చితంగా పూజాకు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందనిపిస్తోంది దీని ప్రోమోలు చూస్తుంటే. ఈ సినిమా హిట్టవ్వాలే కానీ.. పూజా టాలీవుడ్లో ఒకేసారి టాప్ రేంజికి వెళ్లిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు