అక్షయ్ కుమార్, సైనానెహ్వాల్ కు మావోయిస్టుల వార్నింగ్

అక్షయ్ కుమార్, సైనానెహ్వాల్ కు మావోయిస్టుల వార్నింగ్

బడా కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను, ప్రభుత్వాలను, పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేసే మావోయిస్టులు తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు హెచ్చరికలు పంపారు.  తమ దాడిలో మృతి చెందిన సీఆర్ఫీఎఫ్ కుటుంబాలకు వారు ఆర్థిక సాయం చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు మండిపడుతున్నారు.

సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని... మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని అన్నారు. అంతేకానీ... ఇలాంటి చర్యల వల్ల లాభం లేదని వారు అన్నారు.  ఈ మేరకు మావోయిస్టు పార్టీ నుంచి ప్రకటన వెలువడింది.

కాగా ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోయిస్టులు జరిపిన భారీ దాడిలో 27 మంది సీర్పీఎఫ్ జవాన్లు హతమైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ. 9 లక్షల చొప్పున అక్షయ్ కుమార్ సాయం చేశాడు. రూ. 50 వేల చొప్పున సాయం అందిస్తానని సైనా నెహ్వాల్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు వారికి వార్నింగ్ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English