క్రిష్‌ 'మణికర్నిక'కి మరో తలనొప్పి

క్రిష్‌ 'మణికర్నిక'కి మరో తలనొప్పి

ఇప్పటికే తన స్క్రిప్ట్‌ కొట్టేసి వేరే దర్శకుడితో సినిమా తీసేస్తోందంటూ కంగన రనౌత్‌పై కేతన్‌ మెహతా న్యాయ పోరాటానికి దిగాడు. ఝాన్సీ లక్ష్మిభాయ్‌ గురించి అతను చేసిన రీసెర్చ్‌ని దొంగిలించి, మణికర్నిక అంటూ మరో చిత్రం మొదలు పెట్టిందనేది అతని ఆరోపణ.

ఇప్పటికే ఈ వివాదం ముదిరి మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. ఇదిలావుండగా, ఈ చిత్రానికి మరో తలనొప్పి వచ్చి పడింది. ఝాన్సీ కీ రాణి కథతో మరో భారీ సినిమాని తలపెడుతున్నట్టు స్వాతి భిసే ప్రకటించింది. 'ది మ్యాన్‌ హూ న్యూ ఇన్‌ఫినిటీ' పేరిట రామానుజం కథతో హాలీవుడ్‌ సినిమా తీసిన స్వాతి ఇప్పుడు తన కూతురు దేవిక భిసే ప్రధాన పాత్రలో ఝాన్సీ సినిమా తలపెట్టింది. ఆమెకి వున్న హాలీవుడ్‌ లింక్స్‌ దృష్ట్యా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా వైడ్‌ రిలీజ్‌ దక్కుతుందని భావిస్తున్నారు. పైగా మణికర్నిక రూపొందుతోందనే సంగతి తెలియడం వలన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులోగా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అదే జరిగితే కంగన సినిమా కష్టాల్లో పడుతుంది. అసలే న్యాయ వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం ముందుకి కదలడానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు అదే సబ్జెక్ట్‌తో మరో భారీ చిత్రమంటే లేటుగా వచ్చే తన సినిమాపై ప్రభావం ఖచ్చితంగా వుంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం చేసేందుకు కమిట్‌ అయిన క్రిష్‌ ఇప్పుడు ఇరుకున పడ్డాడు. ముందుకి వెళ్లలేక, వెనక్కి రాలేక ప్రస్తుతానికి ఈ చిత్రంతో స్టక్‌ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు