మహేష్‌ కోసం జగన్‌ తగ్గుతాడా?

మహేష్‌ కోసం జగన్‌ తగ్గుతాడా?

మహేష్‌ బాబుతో మరో చిత్రం చేయాలని పూరి జగన్నాథ్‌ చాలా కాలంగా చూస్తున్నాడు. కానీ మహేష్‌ ఇంతవరకు జగన్‌ కోరిక మన్నించలేదు. బిజినెస్‌మేన్‌ వచ్చి చాలా కాలమవుతున్నా జగన్‌కి మహేష్‌ డేట్లు లభించలేదు.

మహేష్‌ మనసు గెలుచుకుని, అతడిని మెప్పించడానికి జగన్‌కి ఇప్పుడో ఛాన్స్‌ దొరికింది. మహేష్‌, మురుగదాస్‌ల 'స్పైడర్‌' చిత్రం దసరాకి విడుదల అవుతుందని మహేష్‌ స్పష్టం చేసాడు. అయితే ఈ డేట్‌ని ముందుగా బాలకృష్ణ సినిమా కోసం లాక్‌ చేసి పెట్టుకున్నారు. పూరి జగన్‌, బాలయ్యల చిత్రం దసరాకి రావడం ఖాయమని ఏనాడో ప్రకటించారు. ముందుగా తామే ఈ డేట్‌ లాక్‌ చేసుకున్నామంటూ మిగతా వారికి చిన్నపాటి హెచ్చరికని కూడా బాలకృష్ణ జారీ చేసారు. అయినప్పటికీ స్పైడర్‌ అదే డేట్‌కి ఫిక్స్‌ అయింది.

బాలయ్య సినిమా తన చిత్రంతో పాటు రిలీజ్‌ అయితే మాస్‌ సెంటర్స్‌లో స్పైడర్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. బాలయ్య, జగన్‌ ఇద్దరికీ మాస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే కనుక ఈ చిత్రాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదు. సంక్రాంతి మాదిరిగా దసరాకి చాలా సినిమాలు ఆడేసే పరిస్థితి వుండదు కనుక స్పైడర్‌కి స్పేస్‌ కావాలి.

మరి మహేష్‌ని మెప్పించడానికి జగన్‌ తన సినిమాని వెనక్కి పంపుతాడా లేక తన సత్తా చాటుకుని మహేష్‌ దృష్టిని తనవైపుకి తిప్పుకోవడానికి పోటీగా రిలీజ్‌ చేస్తాడా అనేది చూడాలి. కాంపిటీషన్‌కి భయపడి వెనక్కి తగ్గడం బాలయ్య స్టయిల్‌ కాదు కనుక ఈ క్లాష్‌ ఆసక్తికరమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు