బాహుబలితో ఇలా పడిపోయిందేంటి?

బాహుబలితో ఇలా పడిపోయిందేంటి?

బాహుబలిలో ముఖ్య పాత్రలు చేసిన అందరికీ మంచి పేరొచ్చింది. ఇప్పుడు వారిలో అందరికీ డిమాండ్‌ పెరిగింది. క్యారెక్టర్‌ రోల్స్‌ చేసిన రమ్యకృష్ణ, సత్యరాజ్‌కి కూడా పేమెంట్స్‌ పెరిగాయి. కానీ ఇందులో ఒక హీరోయిన్‌గా నటించిన తమన్నాని మాత్రం బాహుబలి టాప్‌ నుంచి కిందకి పడేసింది. ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ అయిన తర్వాత తమన్నాని బాహుబలి హీరోయిన్‌గా గుర్తించారు.

అయితే సెకండ్‌ పార్ట్‌లో తన క్యారెక్టర్‌ని జూనియర్‌ ఆర్టిస్ట్‌ స్థాయికి పడేయడంతో ఆ ఎఫెక్ట్‌ ఇప్పుడు తన కెరియర్‌పై రిఫ్లెక్ట్‌ అవుతోంది. బాహుబలి 2 తర్వాత తన డిమాండ్‌ పెరుగుతుందని ఆశించిన తమన్నా ఆమధ్య వచ్చిన కొన్ని ఆఫర్లని కాలదన్నుకుంది. క్వీన్‌ రీమేక్‌లో నటించడానికి భారీ పారితోషికం అడిగి నిర్మాతలని కంగారు పెట్టింది. దాంతో వాళ్లు సినిమా ఆపేసారు. అన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే తనకోసం క్యూ కడతాయని ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమన్నాకి అసలు ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయేసరికి షాక్‌ తగిలింది.

దీంతో ఇప్పుడామె చిన్న చిత్రాలకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తోంది. మహేష్‌, పవన్‌, ప్రభాస్‌, చరణ్‌, అల్లు అర్జున్‌... ఇలా టాప్‌ హీరోలతో నటించిన తమన్నాకి ఇప్పుడు స్టార్‌ హీరోల చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దాంతో ద్వితీయ శ్రేణి హీరో సందీప్‌ కిషన్‌తో నటించడానికి ఓకే అనేసింది.

విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి తమన్నాకి పారితోషికం కూడా ఎక్కువ ఆఫర్‌ చేయలేదట. డబ్బు పేరు చెప్పి ఇదీ పోగొట్టుకోవడం దేనికని అవకాశం రాగానే ఓకే అనేసిందట. తమన్నా కెరియర్‌ లాస్ట్‌ స్టేజ్‌కి చేరుకుందా లేక చిన్న సినిమాలతో హిట్స్‌ సాధించి మళ్లీ టాప్‌ హీరోల సరసకి చేరుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు