త్రివిక్రమ్‌ని చూసి వాత... బడ్జెట్‌ మోత!

త్రివిక్రమ్‌ని చూసి వాత... బడ్జెట్‌ మోత!

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో నితిన్‌ నటించిన 'అ ఆ' చిత్రం దాదాపు యాభై కోట్ల బిజినెస్‌ చేయడంతో, నితిన్‌ తదుపరి చిత్రం 'లై' మీద కూడా లెక్కకి మించి ఖర్చు పెడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బడ్జెట్‌ పాతిక కోట్లు అనుకున్నారట. కానీ ఇప్పుడని నలభై కోట్లకి పెరిగిందని సమాచారం. 'అ ఆ'కి యాభై కోట్లు వచ్చాయి కనుక ఈ చిత్రానికి నలభై ఖర్చయినా వర్కవుట్‌ అవుతుందనే ధీమాతో వున్నారు.

అయితే 'అ ఆ' పూర్తిగా త్రివిక్రమ్‌ బ్రాండ్‌ మీద నడిచిందనే సంగతి విస్మరించరాదు. నితిన్‌కి పెద్ద హిట్‌ వస్తే పాతిక కోట్ల వరకు ఈజీగా వసూలు అవుతాయి కానీ, ఇంకా దర్శకుడిగా ఎలాంటి పేరు లేని హను రాఘవపూడి తీసే సినిమాకి నలభై కోట్లంటే చాలా పెద్ద రిస్క్‌. స్టయిలిష్‌గా, ట్రెండీగా వున్న ఈ చిత్రం ఖచ్చితంగా యూత్‌ని ఆకట్టుకుని, యుఎస్‌తో పాటు సిటీస్‌ అన్నిట్లో బాగా ఆడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇతర భాషల నుంచి రీమేక్‌ రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌ వగైరా అంటూ మరికొంత వస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి ఊహలు, నమ్మకాల మీద వ్యాపారం చేయడం ఎంతవరకు సబబు? 'అ ఆ' సినిమాకి విడుదలకి ముందే యాభై కోట్లు ఎటూ పోవని తెలియడం వల్లే నిర్మాత ధైర్యంగా వున్నాడు. కానీ ఇక్కడ పూర్తిగా ఛాన్స్‌ మీద డిపెండ్‌ అయి రిస్క్‌ చేస్తున్నారు. ఇది ఎటు దారితీస్తుందో, ఈ అబద్ధాన్ని నమ్ముకుని 14 రీల్స్‌ ఎలా గట్టున పడుతుందో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు