ఇది అన్యాయం మురుగదాసా!

ఇది అన్యాయం మురుగదాసా!

మహేష్‌ 'స్పైడర్‌' చిత్రానికి ఇంతవరకు విడుదల తేదీ ఖరారు కాలేదు. కనీసం టీజర్‌ అయినా విడుదల చేసి అభిమానులని ఆనంద పెడతారని అనుకుంటే ఇప్పుడే టీజర్‌ రిలీజ్‌ చేయరాదని దర్శకుడు మురుగదాస్‌ డిసైడ్‌ అయ్యాడు. తన కొత్త సినిమాల టీజర్స్‌ని తన తండ్రి బర్త్‌డేకి, మే 31న విడుదల చేయడం మహేష్‌ కొంత కాలంగా ఫాలో అవుతున్నాడు. కానీ స్పైడర్‌ ఈ సెంటిమెంట్‌ని కొనసాగించడం లేదు.

మహా అయితే ఆ రోజున మరో మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ఇది మహేష్‌ ఫాన్స్‌కి చిర్రెత్తిస్తోంది. గత ఆరేళ్లుగా వున్న సంప్రదాయాన్ని ఎందుకు చెడగొడుతున్నావంటూ మురుగదాస్‌ని తిట్టి పోస్తున్నారు. ముప్పయ్‌ సెకన్ల టీజర్‌ విడుదల చేసే కంటెంట్‌ కూడా సిద్ధంగా లేదా అంటూ గోల పెడుతున్నారు. ఇది అన్యాయమని, ఫాన్స్‌ మనోభావాలు అర్థం చేసుకోవాలని మురుగదాస్‌ని బతిమాలుతున్నారు.

అయితే మూడు భాషల్లో విడుదల చేసే ఈ చిత్రానికి హడావిడిగా టీజర్‌ కట్‌ చేయడం మురుగదాస్‌కి ఇష్టం లేదట. టీజర్‌తో మొత్తం ఇండియన్‌ సినిమా ఫాన్స్‌ అటెన్షన్‌ రాబట్టుకునేలా వుండాలని అంటున్నాడట. అందుకే ఈ సారికి సెంటిమెంట్‌ పక్కన పెట్టేయమని మహేష్‌కి కూడా చెప్పేసాడని టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు