ఈ యాంకర్‌ పని అయిపోయినట్టేనా?

ఈ యాంకర్‌ పని అయిపోయినట్టేనా?

బూతు కామెడీ చేస్తే జనం పగలబడి నవ్వేస్తారని అలాంటి కామెడీతోనే షో హోస్ట్‌గా పాపులర్‌ అయిపోయాడు రవి. పటాస్‌ షోలో అతను చేసిన చిన్నెలు అన్నీ ఇన్నీ కావు. అదే బూతు కామెడీని పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో చేయడం మొదలు పెట్టిన రవి చాలా సందర్భాల్లో గీత దాటి కామెంట్లు చేసాడు. అయితే చలపతిరావు ఆడవాళ్లపై చేసిన కామెంట్లకి సూపర్‌ అని స్పందించి ఇరుకున పడ్డాడు.

తనకి ఆయన ఏమన్నాడో వినపడకపోవడంతో ఒక హోస్ట్‌గా అది తెలియనివ్వకుండా రియాక్ట్‌ అయ్యానని, తన తప్పేమీ లేదని రవి తనని తాను సమర్ధించుకుంటున్నాడు. అయితే ఈ వివాదం వల్ల అతని పటాస్‌ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికీ, దానికీ లింక్‌ పెడతారేంటని మీడియావారితో రవి వాదిస్తూనే వున్నాడు.

ఈ వ్యవహారం వల్ల చలపతిరావుకి వచ్చే నష్టం అంతగా వుండకపోవచ్చు కానీ, ఎదుగుతోన్న దశలో వివాదంలో ఇరుక్కున్న రవి మాత్రం ఇరుకున పడ్డాడు. స్టేజీపై ఆలీ చేస్తోన్న కామెడీ పట్ల విమర్శలు పెరగడంతో ఈమధ్య అతడిని హోస్ట్‌గా తీసుకోవడం లేదు. ఈ వ్యవహారం తర్వాత రవికి కూడా ఇక ఇలాంటి అవకాశాలు రావని భావిస్తున్నారు.

పర్సనల్‌ ఇమేజ్‌ బాగా డ్యామేజ్‌ అవడంతో ఇక అతడికి కొత్త టీవీ షోలు రావడం కూడా కష్టమేనంటున్నారు. ఈ గొడవలో అందరూ వేలెత్తి చూపిస్తోన్న జబర్దస్త్‌, పటాస్‌ షోస్‌ కూడా ఇరుకున పడ్డట్టేనని, వివాదం ముదిరి పాకాన పడకముందే ప్రత్యామ్నాయాలు చూడడం లేదా క్లీన్‌ కంటెంట్‌ వైపు వెళ్లడం బెటర్‌ అని నిర్వాహకులు ఆలోచనలో పడ్డట్టు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మొత్తానికి చలపతిరావు చేసిన ఒక్క కామెంట్‌ మొత్తం టీవీ ఇండస్ట్రీనే కుదిపేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు