ఆ సినిమాకు మోక్షం కలిగించారు

ఆ సినిమాకు మోక్షం కలిగించారు

ఎప్పుడో నాలుగేళ్ల కిందట గోపీచంద్ హీరోగా ఒక సినిమా మొదలైంది. భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడు ఆ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. బాలాజీ ఆర్ట్స్ మీడియా బేనర్ మీద భగవాన్-పుల్లయ్య ఆ చిత్రాన్ని మొదలుపెట్టారు. నయనతార కథానాయిక. దీనికి 'జగన్మోహన్ ఐపీఎస్' అనే టైటిల్ కూడా పెట్టారు. కానీ ఆ సినిమా అనుకున్న ప్రకారం ముందుకు కదల్లేదు. దర్శకుడి పనితీరు నచ్చక తప్పించేశారు.

తర్వాత సీనియర్ దర్శకుడు బి.గోపాల్‌కు ఈ సినిమాను అప్పగించారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అనుకున్న సమయానికి సినిమా పూర్తవలేదు. విడుదలకు నోచుకోలేదు. ఐతే ఎట్టకేలకు ఈ మధ్య మళ్లీ ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది.

'ఆరడుగుల బుల్లెట్' పేరుతో టైటిల్ మార్చి.. గోపీచంద్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి.. సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని మేలోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదర్లేదు. ఎట్టకేలకు జూన్ 9న 'ఆరడుగుల బుల్లెట్'ను విడదుల చేయాలని నిర్ణయించారు. మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశారు. బి.గోపాల్ టేకప్ చేశాక ఈ ప్రాజెక్టులోకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ రావడం విశేషం.

అతను బి.వి.ఎస్.రవితో కలిసి స్క్రిప్టుకు మెరుగులు దిద్దాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా మారాడు. తాండ్ర రమేష్ పేరు కనిపిస్తోంది పోస్టర్లపై. జూన్ 9న అమీ తుమీ, దర్శకుడు లాంటి చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి కాబట్టి 'ఆరడుగుల బుల్లెట్'కు ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారు. మరి ఈ లాంగ్ డిలేయ్డ్ మూవీ గోపీ అండ్ టీంకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English