తన రేంజ్‌ చూపించిన ప్రభాస్‌

తన రేంజ్‌ చూపించిన ప్రభాస్‌

ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోల్లో ప్రభాస్‌ చాలా వేగంగా తన రేంజ్‌ పెంచుకుంటున్నాడు. అతని గత చిత్రం మిర్చి వసూళ్లే ఇందుకు నిదర్శనం. పండగలు ఏమీ లేని డ్రై సీజన్‌లో వచ్చినా కానీ ఈ చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లు సాధించింది. ప్రభాస్‌ తప్ప మరో క్రేజీ ఫ్యాక్టర్‌ ఏమీ లేని ఈ చిత్రం ఇటీవలి కాలంలో అత్యధిక కేంద్రాల్లో యాభై రోజుల ప్రదర్శన జరుపుకుంది. ఈ చిత్రం టోటల్‌ కలెక్షన్స్‌ నలభై ఏడు కోట్లకి పైగా వచ్చాయి. అంటే ఆల్‌టైమ్‌ టాప్‌ హిట్స్‌ లిస్ట్‌లో దీనికి అయిదవ స్థానం దక్కింది.

 ఈ సినిమా కనుక ఏదైనా మంచి సీజన్‌లో వచ్చినట్టయితే కలెక్షన్లు యాభై కోట్లు దాటి ఉండేవని అంటున్నారు. రొటీన్‌ స్టోరీ అయినా కానీ ఈ చిత్రంలో వినోదం బాగా పండడంతో పాటు హీరోయిజం కూడా సరిగ్గా కుదరడంతో ఘన విజయాన్ని అందుకోగలిగింది. దీంతో ప్రభాస్‌ సోలో స్టామినా ఏమిటనేది అందరికీ తెలిసింది. ఒకవేళ మిర్చి రాకపోయినట్టయితే, బాహుబలికి ఎంత కలెక్షన్‌ వచ్చినా కానీ రాజమౌళికే ఎక్కువ క్రెడిట్‌ వెళ్లేది. ప్రభాస్‌ రేంజ్‌ తెలిపే హిట్‌ రైట్‌ టైమ్‌లో పడిందన్నమాట

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు