'వీరభోగ వసంతరాయులు'లో ఇంకో హీరో

'వీరభోగ వసంతరాయులు'లో ఇంకో హీరో

తన ఏజ్ గ్రూప్ అప్ కమింగ్ హీరోలతో కలిసి మినీ మల్టీస్టారర్లు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు నారా రోహిత్. ఆల్రెడీ ప్రతినిధి.. జ్యో అచ్యుతానంద.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాల్లో వేరే హీరోలతో కలిసి నటించాడు రోహిత్. 'కథలో రాజకుమారి'లో సైతం నాగశౌర్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు 'శమంతకమణి' అనే మరో మినీ మల్టీ స్టారర్ చేస్తున్నాడు.

దీంతో పాటు తన మిత్రుడు శ్రీవిష్ణుతో రోహిత్ మరోసారి కలిసి నటించబోతున్న సినిమా 'వీర భోగ వసంతరాయలు'. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలోకి మరో యువ కథానాయకుడు వచ్చాడు. అతనే.. సుధీర్ బాబు. 'శమంతకమణి'లో రోహిత్‌తో కలిసి నటిస్తున్న సుధీర్‌ ను.. 'వీర భోగ వసంతరాయలు'లో ఓ కీలక పాత్ర కోసం ఒప్పించాడు రోహిత్.

మొత్తంగా ముగ్గురు యువ కథానాయకులు.. ఒక సీనియర్ హీరోయిన్ తో 'వీరభోగ వసంతరాయలు'కు కాంబినేషన్ బాగానే సెట్టయింది. టైటిలే ఆసక్తి రేకెత్తిస్తుండగా.. ఈ కాంబో కూడా సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేదే. ఇంద్రసేన.. రోహిత్-శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన 'అప్పట్లో ఒకడుండేవాడు'కు దర్శకత్వ విభాగంలో పని చేశాడు. బెల్లాన అప్పారావు అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 'వీర భోగ వసంతరాయలు' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English