ఐతే వాళ్లు బాహుబలిని చూడరన్నమాట

ఐతే వాళ్లు బాహుబలిని చూడరన్నమాట

బాహుబలి-2 ప్రభంజనం మీద నెమ్మదిగా ఒక్కో బాలీవుడ్ సూపర్ స్టార్ స్పందిస్తున్నాడు. ముఖ్యంగా ఖాన్ త్రయంలో ఒక్కొక్కరు ఈ సినిమా గురించి తమ అభిప్రాయం చెబుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజమౌళి ఇన్‌స్పిరేషన్ అని షారుఖ్ ఖాన్ అంటే.. ‘బాహుబలి-2’ను చూసి గర్విస్తున్నా అని అమీర్ ఖాన్ అన్నాడు.

ఇక లేటెస్టుగా సల్మాన్ ఖాన్ సైతం లైన్లోకి వచ్చాడు. బాహుబలి-2 గురించి సానుకూలంగా స్పందిస్తూనే.. ఈ సినిమా వసూళ్ల విషయంలో సెటైర్ వేశాడు సల్మాన్. బాహుబలి-2 వసూళ్లను ‘ట్యూబ్ లైట్’ అధిగమిస్తుందా అని అడిగితే.. తాను ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని.. బాహుబలి రెండు భాగాలు కలిపి నాలుగేళ్లు తీశారని.. ఆ లెక్కన తాను నాలుగేళ్లలో చేసిన సినిమాలన్నింటి వసూళ్లు కలిపితే.. బాహుబలి వసూళ్ల కంటే ఎక్కువుంటాయని సల్మాన్ అనడం విశేషం.

ఇక ఖాన్‌లు బాహుబలి-2 గురించి చేసిన కామెంట్ల విషయం పక్కన పెడితే.. వీళ్లు ముగ్గురూ బాహుబలి-2 సినిమా చూడకపోవడం అన్నది కామన్ పాయింట్. నెల రోజుల నుంచి ఇంతగా వార్తల్లో నిలుస్తూ.. ఇంతగా చర్చనీయాంశమవుతూ.. ఆ స్థాయిలో వసూళ్లు రాబడుతున్న సినిమాలో ఏముందో అని సగటు ప్రేక్షకులకే.. సినీ జనాలకు కూడా ఆసక్తి కలగడం ఖాయం. ఖాన్ హీరోలకు కూడా కచ్చితంగా క్యూరియాసిటీ ఉండే ఉంటుంది.

అయినా వాళ్లు సినిమా చూడలేదంటే.. ఉద్దేశపూర్వకంగానే సైలెంటుగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. సచిన్ సినిమా ప్రిమియర్ షోకు.. మిగతా కార్యక్రమాలకు వస్తున్న వాళ్లకు బాహుబలి-2ను చూసే తీరిక.. ఓపిక ఉండదా? అదే ఓ బాలీవుడ్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుంటే ఇంకా చూడకుండా ఉంటారా?

ఇది ఓ సౌత్ మూవీ. దాన్ని మనం చూసి.. సినిమాలో విశేషాల గురించి మాట్లాడితే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు అవుతుందని ఖాన్స్ భావిస్తున్నారని అర్థమవుతోంది. ఏదో మీడియా వాళ్లు అడిగినపుడు తప్పదు కాబట్టి మొక్కుబడిగా స్పందించారు కానీ.. లేదంటే ఈ ఖాన్స్‌కు బాహుబలి-2 గురించి మాట్లాడటం ఇష్టం లేదనే వారి తీరును బట్టి తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English