అల్లు అరవింద్‌ భయపెట్టాడంట

అల్లు అరవింద్‌ భయపెట్టాడంట

'ప్రేమకథా చిత్రమ్‌'కి దర్శకత్వ పర్యవేక్షణ అని టైటిల్‌ కార్డ్‌ వేసుకోవడం ద్వారా మారుతి చాలా విమర్శలకి గురయ్యాడు. రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్‌ చేసిన మారుతి వేరొకరి సినిమాకి 'పర్యవేక్షణ' చేసేంత ఘనుడా అని మీడియా సెటైర్లు వేసింది. ఆ చిత్రానికి స్క్రిప్ట్‌ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన మారుతి డైరెక్టర్‌ ప్రభాకర్‌కి ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వలేదు. ఆ సినిమా సక్సెస్‌ని ఓన్‌ చేసుకుని సర్వం తానే అన్నట్టు ప్రవర్తించాడు. ఇది కూడా విమర్శల పాలయింది.

అయితే అప్పుడు తానలా చేయడానికి అసలు కారణాన్ని మారుతి ఇప్పుడు చెప్పాడు. నిజానికి 'ప్రేమకథా చిత్రమ్‌'కి దర్శకుడు మారుతేనట. ఈ రోజుల్లో, బస్‌స్టాప్‌ తర్వాత అతనికి అల్లు అరవింద్‌ నిర్మాణంలో పని చేసే అవకాశం దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ లేట్‌ అవుతుండడంతో, ఈలోగా ఒక చిన్న సినిమా చేసుకుంటానని అల్లు అరవింద్‌ని మారుతి అడిగాడట.

అయితే ఈ సినిమా ఫ్లాప్‌ అయితే తను నిర్మించే సినిమా ఎఫెక్ట్‌ అవుతుంది కదా అని అల్లు అరవింద్‌ భయపెట్టాడట. దాంతో ఆ పెద్ద సినిమా అవకాశాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక 'ప్రేమకథా చిత్రమ్‌'కి మారుతి దర్శకుడిగా క్రెడిట్‌ తీసుకోలేదు. తన ప్రాజెక్ట్‌ని అతను బలంగా నమ్మినట్టయితే, అల్లు అరవింద్‌ భయపెట్టినా ధైర్యం చేసేవాడేమో. మారుతి కూడా ఊహించని స్థాయిలో 'ప్రేమకథాచిత్రమ్‌' ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికైనా ఆ సినిమా తనదేనని చెప్పడం ఉత్తమమని భావించాడేమో... ఇలా విషయం బయట పెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English