ఏ ముఖం పెట్టుకుని వచ్చావు తాప్సీ?

ఏ ముఖం పెట్టుకుని వచ్చావు తాప్సీ?

హిందీలో పింక్‌ కాస్త ఆడేసరికి తాప్సీ ఇక బాలీవుడ్‌ స్టార్‌ అయిపోయానని అనుకుంది. అదే పనిగా అవకాశాలు వచ్చి పడిపోతాయని ఆశించింది. కానీ పింక్‌ తర్వాత తాప్సీ సినిమాలకి అంత సీన్‌ లేదని, అది కేవలం కథా బలమే తప్ప తన ప్రతిభ ఏమీ లేదని తేలిపోయింది. తాప్సీని ఇంకా మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ గుర్తించడం లేదు.

అయితే పింక్‌ తర్వాత తాప్సీ రెచ్చిపోయి స్టేట్‌మెంట్స్‌ ఇచ్చింది. తన టాలెంట్‌ని దక్షిణాది చిత్ర పరిశ్రమ దుర్వినియోగం చేసిందని, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తనని గ్లామర్‌ పాత్రలకి పరిమితం చేసిందని ఆరోపణలు చేసింది. మూస పాత్రల్లో పడేసి తనపై తనకే అనుమానాలు కలిగేట్టు చేసారని, కాన్ఫిడెన్స్‌ కోల్పోయానని తెలుగు చిత్రాలపై దారుణమైన కామెంట్లు చేసింది. అయితే ఏడాది తిరగకుండా మళ్లీ తెలుగులో సినిమా సైన్‌ చేసింది.

పోనీ అదేమైనా పింక్‌లాంటి విప్లవాత్మక సినిమానా అంటే కాదు. ఒక హారర్‌ కామెడీ. సుధీర్‌ బాబు చేస్తోన్న ఆనందో బ్రహ్మ చిత్రంతో తాప్సీ తిరిగి తెలుగు ఇండస్ట్రీకి వస్తోంది. ఆమె నటించిన గత చిత్రం గంగ కూడా హారర్‌ కామెడీనే. ఈసారి కూడా తన టాలెంట్‌కి తగ్గ క్యారెక్టర్‌ దొరకలేదు కదా, మరి తాప్సీ ఈ ఆఫర్‌ ఎందుకు ఓకే చేసినట్టు?

అంటే అవకాశాలొస్తే ఏదైనా తీసుకుంటుంది కానీ అది ఫెయిలైతే మాత్రం తన టాలెంట్‌ వాడుకోలేదని అంటుందా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. అందుకే హిట్‌ వచ్చింది కదా అనే ఉత్సాహంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడేయకూడదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు