వాళ్లకి షాకిచ్చిన అల్లు అరవింద్‌

వాళ్లకి షాకిచ్చిన అల్లు అరవింద్‌

'మగధీర' కథని తమకి నచ్చినట్టుగా మార్చేసుకుని 'రాబ్తా' అంటూ హిందీలో ఒక సినిమా తీసేసారు. 'ధోని' ఫేమ్‌ సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా క్రితి సనాన్‌ నటించింది. జూన్‌ 9న విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రం విడుదలని ఆపేయాలంటూ మగధీర నిర్మాత అల్లు అరవింద్‌ కోర్టుకి వెళ్లారు. తమ సినిమా కథని చోరీ చేసారని ఆయన ఆరోపించారు. రాబ్తా ట్రెయిలర్‌ రిలీజ్‌ అయినపుడే ఇదేదో మగధీరకి దగ్గరగా వుందని మనోళ్లంతా మాట్లాడుకున్నారు.

మగధీర చౌర్యానికి గురయిందని తెలుసుకున్న అల్లు అరవింద్‌ ఇప్పుడు కోర్టుకి వెళ్లారు. విచారణలో రెండు సినిమాలకీ మధ్య సారూప్యం కనిపిస్తే కాపీ రైట్స్‌ చట్టం కింద రాబ్తా మేకర్స్‌ పెద్ద ఇబ్బందుల్లోనే పడతారు. వివాదం సమసిపోయే వరకు సినిమా విడుదలని కనుక కోర్టు నిలిపివేస్తే అది మరింతగా ఈ చిత్రాన్ని ఇబ్బంది పెడుతుంది.

మరి పరిహారం చెల్లించి కోర్టు బయట ఈ వివాదాన్ని సెటిల్‌ చేసుకుంటారో లేక కోర్టులోనే తేల్చుకుంటామని అంటారో కానీ సౌత్‌ నుంచి అధికారికంగా రీమేక్‌ రైట్స్‌ తీసుకుని హిందీలో చేసుకుంటోన్న టైమ్‌లో ఇలా కాపీ కొట్టాలనే కక్కుర్తి బుద్ధి ఎలా పుట్టిందో? కథ మొత్తం మార్చేస్తామని, ఎవరూ గుర్తించలేరని అనుకుని పప్పులో కాలు వేసినట్టున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు