బాహుబలిని ఇరకాటంటో పెట్టేశారే..

బాహుబలిని ఇరకాటంటో పెట్టేశారే..

'బాహుబలి: ది బిగినింగ్' ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలై.. చాలా చోట్ల కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టింది. కానీ ఆ సినిమాకు చైనాలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. అక్కడ నామమాత్రపు వసూళ్లు వచ్చాయి. రిలీజ్ ఖర్చులు  కూడా తిరిగి రాలేని పరిస్థితి. ఈ సినిమాను ఆలస్యంగా రిలీజ్ చేయడం.. అప్పటికే పైరసీ వెర్షన్లు బయటికి వచ్చేయడం.. సరైన స్క్రీన్లు లభించకపోవడం.. ఇలాంటి కారణాలే ఆ ఫలితం రావడానికి కారణమని అన్నాడు నిర్మాత శోభు యార్లగడ్డ.

కానీ 'దంగల్' సైతం ఇండియాలో రిలీజైన నాలుగు నెలల తర్వాత చైనాలో రిలీజైంది. ఈ సినిమా పైరసీ వెర్షన్లు కూడా ఆన్ లైన్లోకి వచ్చాయి. అయినప్పటికీ 'దంగల్' అక్కడ దుమ్ము దులుపుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా వెయ్యి కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది.

ఇప్పుడిక 'బాహుబలి: ది బిగినింగ్'ను సాధ్యమైనంత త్వరగా చైనాలో విడుదల చేద్దామని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. 'దంగల్' ఇండియా నుంచి చైనాకు వెళ్లిందాని కంటే తక్కువ సమయంలోనే 'ది కంక్లూజన్'ను చైనాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతన్నాయి.

ఈసారి డిస్ట్రిబ్యూటర్‌తో ముందు నుంచే టచ్‌లో ఉన్నామని.. మంచి స్క్రీన్లలో.. పెద్ద ఎత్తున 'బాహుబలి-2'ను చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తామని అంటున్నాడు శోభు. మరి 'ది బిగినింగ్' విషయంలో జరిగిన తప్పుల్ని దిద్దుకుని 'ది కంక్లూజన్'ను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇప్పటికే 'బాహుబలి-2' నెలకొల్పిన రికార్డుల్ని కొన్ని రోజులైనా నిలవనివ్వకుండా చేసిన 'దంగల్'.. చైనా వసూళ్ల విషయంలోనూ 'బాహుబలి-2'కు పెద్ద సవాలుగా నిలవబోతోంది. ఆ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. 'బాహుబలి-2' ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 'ది కంక్లూజన్'కు కూడా 'ది బిగినింగ్' తరహా ఫలితమే వస్తే మాత్రం ఇబ్బందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు