కర్నాటకకి కొత్త లెక్కలు చూపిన రాజమౌళి

కర్నాటకకి కొత్త లెక్కలు చూపిన రాజమౌళి

సౌత్‌ ఇండియన్‌ సినిమా మార్కెట్లలో అత్యంత వీక్‌ అయిన కన్నడ చిత్ర సీమకి వంద కోట్ల బిజినెస్‌ చేసే సత్తా వుందని బాహుబలి 2 నిరూపించింది. కన్నడ మార్కెట్‌ యాభై కోట్ల పైనే వుందని మొదటిసారిగా బాహుబలి 1 చూపిస్తే, ఇప్పుడు రెండవ భాగంతో వంద కోట్లకి కన్నడ సినిమా మార్కెట్‌ పెరిగింది. తెలుగు, తమిళ చిత్రాలు కర్నాటకలో బాగానే ఆడతాయి కానీ, బాహుబలి కన్నడ చిత్రాలనే మించిపోయింది.

మొదటి భాగంతో నలభై కోట్ల షేర్‌ వచ్చినప్పటికీ రెండవ భాగం విషయంలో కన్నడ బయ్యర్లు వెనక్కి తగ్గారు. విడుదలకి ముందు సత్యరాజ్‌ కారణంగా వివాదాలు, నిషేధిస్తారంటూ అనుమానాలు, టికెట్‌ ధరలపై ఆంక్షలు విధిస్తారనే భయాలు నేపథ్యంలో చివరి వరకు బయ్యర్‌ దొరకలేదు.

దాంతో నిర్మాతలే కర్నాటకలో విడుదల చేసారు. విడుదలైన రోజు నుంచీ కలక్షన్ల భరతం పట్టిన బాహుబలి దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహా మిగతా అన్ని చోట్ల వంద కోట్లకి పైగా వసూళ్లు తెచ్చుకోవడం గమనార్హం.

అరవై మూడు కోట్ల షేర్‌తో తమిళనాడులో నంబర్‌వన్‌గా వున్న రోబో షేర్‌ని కూడా బాహుబలి అధిగమించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు