ప్రభాస్‌ ఆ లోటు కూడా తీర్చేస్తాడు

ప్రభాస్‌ ఆ లోటు కూడా తీర్చేస్తాడు

'బాహుబలి'తో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ని ఇప్పుడు నేషనల్‌ స్టార్‌ అంటున్నారు. ఈ క్రేజ్‌ని ఒక్క సినిమాకి పరిమితం చేయకుండా, హిందీ మార్కెట్‌లో పాతుకుపోవాలని ప్రభాస్‌ చూస్తున్నాడు. ఇందుకోసం ముందుగా హిందీ మీద పట్టు సాధించే పనిలో పడ్డాడు. 'బాహుబలి' చిత్రానికి హిందీ, తమిళంలో డబ్బింగ్‌ చెప్పించారు. 'సాహో'కి అలా జరగకుండా తన ఓన్‌ వాయిస్‌తో డబ్బింగ్‌ చెప్పాలని ప్రభాస్‌ డిసైడయ్యాడు.

డబ్బింగ్‌ వాయిస్‌ అయితే హీరో ఎంత పేరు తెచ్చుకున్నా కానీ పూర్తి స్థాయిలో జనానికి చేరువ కాలేడు. అందుకే ఈ లోటు భర్తీ చేసి, సాహోతో పూర్తిస్థాయి జాతీయ నటుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. బాహుబలి 2 చిత్రాన్ని ఏ విధంగా అయితే పూర్తిస్థాయిలో బాలీవుడ్‌ మార్కెట్‌ టార్గెట్‌ చేస్తూ విడుదల చేసారో, సాహోని కూడా అలాగే చేయాలని అనుకుంటున్నారు.

అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్‌ హిందీ సినిమాలానే దీనిని ట్రీట్‌ చేస్తున్నారు. స్టార్‌ కాస్ట్‌, మ్యూజిక్‌ అన్నీ నేషనల్‌ అప్పీల్‌ వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలిని రాజమౌళి ఖాతాలోనే వేసేవాళ్లు చాలా మందే వున్నారు కనుక అలాంటి వారందరికీ సాహోతో సమాధానం చెప్పి, నేషనల్‌ స్టార్‌గా సెటిల్‌ అయిపోవాలని ప్రభాస్‌తో పాటు యువి క్రియేషన్స్‌ కూడా కలిసి పెద్ద స్కెచ్‌ రెడీ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు