హెబ్బాతో 30 సినిమాలు చేస్తాడట

హెబ్బాతో 30 సినిమాలు చేస్తాడట

ఒక హీరో ఓ హీరోయిన్ తో రెండు లేదా మూడు సినిమాలు చేశాడంటే.. రకరకాల పుకార్లు షికార్లు చేస్తాయి. వాళ్ల మధ్య ఏదో ఉందని ప్రచారాలు మొదలైపోతాయి. అందులోనూ ఒక అప్ కమింగ్ హీరో.. మళ్లీ మళ్లీ హీరోయిన్ని రిపీట్ చేస్తే రూమర్లు పెద్ద ఎత్తునే వస్తాయి. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంట గురించి ఇలాగే ప్రచారం జరిగింది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తొలిసారి జంట కట్టిన రాజ్-హెబ్బా.. ఆ తర్వాత ‘ఆడోరకం ఈడోరకం’లోనూ జోడీగా కనిపించారు. ఆ రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడీ జంట ‘అంధగాడు’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా హెబ్బాతో చాలా తక్కువ సమయంలో మూడు సినిమాలు చేసేశారేంటి అని రాజ్ తరుణ్ ను అడిగితే.. ‘‘మూడు కాదు.. తనతో 30 సినిమాలు చేయాలనుంది. చేస్తా’’ అని చెప్పడం విశేషం. తమ ఇద్దరిదీ హిట్ పెయిర్ కావడం వల్లే దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా తాము కలిసి నటించాలని కోరుకుంటున్నారని.. అంతకుమించి ఏమీ లేదని రాజ్ అన్నాడు.

‘అంధగాడు’ సినిమాలో ప్రతి పావు గంటకూ ఒక కొత్త జానర్ ప్రేక్షకులకు పరిచయం అవుతుందని.. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ కథను అంత బాగా రాశాడని రాజ్ తరుణ్ కితాబిచ్చాడు. హెబ్బాతో కలిసే కాదు.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనూ రాజ్ తరుణ్ చేస్తున్న మూడో సినిమా ‘అంధగాడు’. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English