సమంత ఎంత అల్లరమ్మాయంటే...

సమంత ఎంత అల్లరమ్మాయంటే...

ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంత ప్రి మ్యారీడ్ లైఫ్ ను భలేగా ఎంజాయ్ చేస్తున్న సంగతి చాలాసార్లు గమనించే ఉంటారు. వాళ్లిద్దరూ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫొటోలు చాలానే బయటికి వచ్చాయి. అందులో చైతూ వంట చేస్తున్న ఫొటోలు కూడా ఉన్నాయి. సమంత కోసం చైతూ వంట చేసిపెట్టడం భలే సరదాగా అనిపించింది. ఐతే ఈ ఫొటోలు చైతూకు తెలియకుండానే సోషల్ మీడియాలోకి వచ్చాయట. సమంత అల్లరి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో రుజువు అంటున్నాడు చైతూ.

‘‘నాకు వంట అంత గొప్పగా ఏమీ రాదు. అప్పుడప్పుడూ సరదాగా కుక్‌ చేస్తుంటాను. ఐతే ఒక రోజు అలాగే సరదాగా వంట చేస్తుంటే నాకు తెలియకుండా ఫొటోలు తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టేసింది. నేనేమో సోషల్‌ మీడియా అంటే కొంచెం దూరంగా ఉంటాను. పర్సనల్ ఫొటోల్ని షేర్ చేసుకోను. కానీ సమంత నా వంట ఫొటోల్ని సోషల్ మీడియాోల పెట్టింది. నేనెలా రియాక్ట్‌ అవుతానో అని సరదాగా అలా చేస్తుంది. సమంత బాగా అల్లరి అమ్మాయి’’ అని చైతూ తెలిపాడు.

సమంత తన జీవితంలో ఉంటే లైఫ్‌ చాలా కలర్‌ ఫుల్‌ గా.. జాలీగా.. హ్యాపీగా ఉంటుందని చైతూ అన్నాడు. సమంతతో తన పెళ్లి అక్టోబర్లో ఉంటుందని చెప్పిన చైతూ.. కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ మీద ఆసక్తి చూపించిన నేపథ్యంలో మీకు అలాంటి ఆలోచనలేమీ లేవా అని అడిగితే..  ‘‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటే ఇక్కడి నుంచి అందరం ఎక్కడికో వెళ్లాలి. ఫ్యామిలీలో పెద్దవాళ్లు ఉంటారు. వాళ్లు ప్రయాణం చేయడానికి ఇబ్బందిపడతారు. అందుకే హైదరాబాద్‌ లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని చైతూ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు