ప్రతి నటుడూ ఆయనతో ఒకసారి పని చేయాలి - ఎన్టీఆర్

ప్రతి నటుడూ ఆయనతో ఒకసారి పని చేయాలి - ఎన్టీఆర్

ఓవైపు ‘జై లవకుశ’ దర్శకుడు బాబీయేమో.. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్‌లో అవగొట్టేస్తాడని.. షూటింగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా వన్స్ మోర్ అనే అవకాశం తనకు ఇవ్వలేదని అంటున్నాడు.

ఐతే మరోవైపు ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ టైంలో ఒక సీన్ కోసం 40-50 టేక్స్ తీసుకున్నాడంటూ సుకుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం నటీనటుల్ని ఎంతగా ఏడిపిస్తాడనే విషయాన్ని ఎన్టీఆర్ సరదాగా పంచుకున్నాడు.

‘‘నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ సందర్భంగా ఒక రోజు నామీద.. జగపతి బాబు గారి మీద ఒక సీన్ షూట్ చేశారు. నాకు ఆయనకు మధ్య వచ్చే బాల్ సీన్ అది. సుకుమార్ అసిస్టెంట్లు వచ్చి నాకు డైలాగ్ చెప్పారు. నేను చకచకా చెప్పేశాను. సుకుమార్ దగ్గరికొచ్చి చాలా బాగా డైలాగ్ చెప్పానని చెప్పి.. నన్ను కౌగిలించుకుని కిస్ కూడా ఇచ్చాడు. పక్కనున్న నిర్మాత ప్రసాద్ గారి వైపు గర్వంగా చూశాను. రెండు రోజులు ప్లాన్ చేసిన సీన్.. ఎంత సింపుల్ గా చేసేశానో అనే విజయ గర్వంతో ఆయన వైపు చూశాను. సీన్ అయిపోయింది కాబట్టి ఇక ప్యాకప్పే కదా అనుకున్నాను. కానీ సుకుమార్ గారు ఇంకో టేక్ అన్నారు. ఎందుకో అర్థం కాలేదు. అలా ఒకే డైలాగ్ 40-50 సార్లు చెప్పించి ఏడిపించారు. నేను డైలాగ్ బాగా చెప్పానని అభినందించిన తర్వాత కూడా అన్నిసార్లు మళ్లీ మళ్లీ అదే సీన్ చేయించాడంటే సుకుమార్ కు పని మీద ఎంత ప్యాషన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన పరిశ్రమలోని ప్రతి నటుడూ సుకుమార్‌ తో ఒకసారి పని చేయాలి’’ అని ఎన్టీఆర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు