ఇంకో బాహుబలి అయ్యే సత్తా వుంది: చిరంజీవి

ఇంకో బాహుబలి అయ్యే సత్తా వుంది: చిరంజీవి

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'పై మెగాస్టార్‌ చిరంజీవికి చాలా నమ్మకమే వున్నట్టుంది. ఈ చిత్రం 'బాహుబలి' మాదిరిగా సరిహద్దులు దాటి యూనివర్సల్‌ సినిమా అనిపించుకోగలదని ఆయన నమ్ముతున్నారు. తమ వద్ద సరిపడా మెటీరియల్‌ లేకపోయినప్పటికీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకి మంచి కమర్షియల్‌ సినిమా కాగలిగే స్క్రీన్‌ప్లేని సురేందర్‌ రెడ్డి రాసాడని ఆయన అంటున్నారు.

ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో కూడా విడుదల చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెరుగుతున్నా కానీ తగ్గేది లేదని చిరంజీవి ఉద్ఘాటించారు. వార్‌ ఎపిసోడ్స్‌కి, సెట్స్‌కి, గ్రాఫిక్స్‌కి ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతామని, సరిగ్గా తీసి, సరిగ్గా మార్కెట్‌ చేస్తే ఇంకో బాహుబలి కాగలిగే సత్తా ఈ చిత్రానికి వుందని ఆయన అంటున్నారు.

రవివర్మ సినిమాటోగ్రఫీ, రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ చేస్తున్నారని చిరంజీవి తెలిపారు. ఇప్పటికే సెట్స్‌కి సంబంధించిన వర్క్‌ మొదలైందని, ఆగస్టులో సినిమా ప్రారంభించి వచ్చే వేసవికి విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. హీరోయిన్‌ని కూడా హిందీ, తమిళ మార్కెట్లని దృష్టిలో వుంచుకుని ఫైనలైజ్‌ చేస్తామని అన్నారు. చిరంజీవి కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్ట్‌ తెలుగు సినిమా పరిశ్రమకి మరో గొప్ప సినిమా కాగలదనే నమ్మకం కలుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు