బన్నీ బ్యాచ్ ప్రొడక్షన్స్

బన్నీ బ్యాచ్ ప్రొడక్షన్స్

కథానాయకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. మంచు విష్ణు, మనోజ్, శర్వానంద్, సిద్ధార్థ్, నాని  తదితర యువ కథానాయకులంతా నిర్మాతలుగా మారారు. సొంత డబ్బును ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. తాజాగా ఆ జాబితాలోకి మరో కథానాయకుడు చేరాడు. ఆయన ఎవరో కాదు...  అల్లు అర్జున్. తన స్నేహితులతో కలిసి అల్లు అర్జున్ బి బ్యాచ్ ప్రొడక్షన్స్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సంస్థపై ఇక నుంచి వరుసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. కొత్త ఆలోచనలతో వచ్చే యువతరంతో సినిమాలు తీయాలని బన్నీ అండ్ బ్యాచ్ నిర్ణయించుకుంది. తొలి ప్రయత్నంగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని సమాచారం.

అల్లు అర్జున్ సన్నిహిత మిత్రుడు బన్నీ వాసు ఈ సంస్థలో ఓ భాగస్వామి. ఇప్పటిదాకా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే సినిమాలు తీశారు. ఇకనుంచి బీ బ్యాచ్ ప్రొడక్షన్లో సినిమాలు తీస్తారు. అల్లు అర్జున్ మాత్రమె కాకుండా... ఇకపై  మరికొద్దిమంది కథానాయకులు నిర్మాతలుగా మారే అవకాశాలు ఉన్నాయి. రాంచరణ్ ఇప్పటికే తన తండ్రితో ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. అలాగే వెంకటేష్ కూడా ఈ ఏడాది ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు