ఆ భామ బడాయి చూశారా?

ఆ భామ బడాయి చూశారా?

అనీషా ఆంబ్రోస్ అనగానే అందరికీ పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు. 'అలియాస్ జానకి' సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అమ్మాయిని 'గబ్బర్ సింగ్' సీక్వెల్ కు ఎంచుకుని అందరికీ పెద్ద షాకిచ్చాడు అప్పట్లో పవన్ కళ్యాణ్. ఐతే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను తప్పించక తప్పలేదు. పవన్ సినిమా మిస్సయినా.. ఆ సమయంలో వచ్చిన పబ్లిసిటీతో కొన్ని అవకాశాలైతే అందుకుంది అనీషా.

కానీ ఆమెకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. 'అలియాస్ జానకి' తర్వాత ఆమె నటించిన 'రన్'.. 'మనమంతా' కూడా ఆడలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ సీనియర్ దర్శకుడు వంశీ డైరెక్షన్లో చేసిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' మీదే ఉన్నాయి. ఐతే కేవలం వంశీ డైరెక్టర్ కాబట్టే ఈ సినిమా ఒప్పుకున్నా అంటూ ఈ భామ బడాయి పోతుండటం విశేషం.

వంశీతో చేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో అనీషాను అడిగితే.. ''ఆయనతో పని చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. కేవలం వంశీ గారు దర్శకుడనే 'ఫ్యాషన్ డిజైనర్'లో ఈ గ్లామర్ రోల్‌కు ఒప్పుకున్నాను'' అని చెప్పిందామె. ఐతే అనీషా ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే.. సినిమాల ఎంపికలో ఆమెకు ఛాయిస్ అంటూ ఏమీ లేదు. ఎలాంటి అవకాశం వచ్చినా ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో ఉంది అనీషా.

ఇక 'ఫ్యాషన్ డిజైనర్'లో తన పాత్ర గురించి వివరిస్తూ.. ''ఇంతకుముందు నేను చేసిన సినిమాల్లో సింపుల్ క్యారెక్టర్స్ చేశాను. మామూలు అమ్మాయిలా కనిపించాను. కానీ ఇందులో గ్లామరస్ రోల్ దక్కింది. ఇందులో చాలా రొమాన్స్ ఉంటుంది. నా కాస్ట్యూమ్స్ కూడా ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి'' అని చెప్పింది అనీషా. 'ఫ్యాషన్ డిజైనర్'తో పాటు మంచు మనోజ్ సినిమా 'ఒక్కడు మిగిలాడు'లో కూడా కథానాయికగా నటిస్తోంది అనీషా. ఈ రెండు సినిమాల ఫలితాల్ని బట్టే ఆమె కెరీర్ డిసైడవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English