బాహుబలి 2 రికార్డులకి అప్పుడే మూడిందా?

 బాహుబలి 2 రికార్డులకి అప్పుడే మూడిందా?

'బాహుబలి 2' పదిహేను వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి, ఇండియన్‌ సినిమా హిస్టరీలో అతి పెద్ద గ్రాసర్‌ అనిపించుకుంది. ఇప్పటికీ మంచి వసూళ్లే రాబట్టుకుంటున్నా కానీ చైనాలో ఇటీవలే విడుదలైన 'దంగల్‌' ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస్తూ బాహుబలికి వున్న మార్జిన్‌ని తగ్గించేస్తోంది.

ఇప్పటికే చైనాలో ఎనభై అయిదు మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టి, చైనాలో హాలీవుడ్‌ సినిమాలు మినహా అత్యధిక వసూళ్లు సాధించిన పరదేశీ చిత్రంగా రికార్డులకెక్కింది. మరో రెండు, మూడు రోజుల్లో చైనాలో వంద మిలియన్‌ డాలర్ల మార్కుని దాటబోతోన్న దంగల్‌,  ఒక్క చైనాలోనే వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే పధ్నాలుగు వందల కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన దంగల్‌ చైనా వసూళ్లతో బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సాధించిన రికార్డుని బీట్‌ చేసేట్టుంది. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ హిట్‌ అనిపించుకున్న కొద్ది రోజులకే ఎప్పుడో రిలీజ్‌ అయిన హిందీ సినిమాతో ఆ రికార్డుకి త్రెట్‌ ఏర్పడడం విశేషం.

అయితే ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా బాహుబలి 2 రికార్డుకి ఇప్పట్లో వచ్చే ప్రమాదం లేదు. అమీర్‌ ఖాన్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ వచ్చే వరకు బాహుబలి 2 రికార్డులకేం కాదని చెప్పవచ్చు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English