ఇన్ని కాంట్రవర్సీలా... ఏమి హీరోయినండీ బాబూ!

ఇన్ని కాంట్రవర్సీలా... ఏమి హీరోయినండీ బాబూ!

కంగనా రనౌత్‌ పేరుని కాంట్రవర్సీ రనౌత్‌గా మార్చేయవచ్చునేమో. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో వుండే కంగన రనౌత్‌ కేవలం టాలెంట్‌ వల్లే ఇంకా బాలీవుడ్‌లో నెగ్గుకొస్తోందని అనుకోవాలేమో.

హృతిక్‌తో సీక్రెట్‌ అఫైర్‌ నడిపి, అతనితో విడిపోయిన తర్వాత దానిని రచ్చ, రచ్చ చేసిన కంగన ఆ తర్వాత 'కాఫీ విత్‌ కరన్‌' షోకి వచ్చి కరన్‌ జోహార్‌పైనే విమర్శలు గుప్పించింది. రియల్‌ టాలెంట్‌ని తొక్కేస్తున్నాడంటూ అతడిపై చాలా నిందలు వేసింది. అంత కష్టంగా వుంటే బాలీవుడ్‌ వదిలేసి పొమ్మని అతడు అనేట్టు చేసింది. ఈమధ్య క్రియేటివ్‌ విషయాల్లో వేళ్లు పెడుతోన్న కంగన తన సినిమాలకి రైటింగ్‌ క్రెడిట్స్‌ తీసుకుని ఒక రైటర్‌ని, దర్శకుడిని మార్చేసి ఒక డైరెక్టర్‌ని ఇబ్బంది పెట్టింది.

తను రాసిన దానికి క్రెడిట్‌ తీసుకుందని అంటూ 'సిమ్రన్‌' రచయిత అపూర్వ అస్రాని సోషల్‌ మీడియాకి ఎక్కాడు. ఇంతలోనే 'మణికర్నిక' స్క్రిప్టు తన దగ్గర్నుంచి దొంగిలించి వేరే దర్శకుడితో (క్రిష్‌) ఆ సినిమా చేస్తోందని దర్శకుడు కేతన్‌ మెహతా కోర్టుకెక్కాడు. ఆ చిత్రం షూటింగ్‌ జరగడానికి వీల్లేదంటూ న్యాయ పరమైన చర్యలు తీసుకుంటున్నాడు. పదేళ్ల పాటు తాను వర్క్‌ చేసిన స్క్రిప్ట్‌ని కంగనతో డిస్కస్‌ చేస్తే, తన రీసెర్చ్‌ మొత్తం తస్కరించి వేరొకరితో ఆ సినిమా మొదలు పెట్టిందంటూ ఆమెపై న్యాయ పోరాటానికి దిగాడు.

చాలా మంది వివాదాస్పద పర్సనాలటీలని చూసిన బాలీవుడ్‌ అత్యంత వివాదాస్పద నటి మాత్రం కంగనా రనౌతేనని అంటోంది. రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న పిమ్మట మళ్లీ విజయాన్ని చవిచూడని కంగన ఈ కాంట్రవర్సీల నేపథ్యంలో ఖచ్చితంగా హిట్టివ్వాలి. లేదంటే ఆమె పతనాన్ని కోరుకుంటోన్న చాలా మంది అపజయాల్ని వాడుకుని కంగన కెరియర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు