ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బాహుబలి-2 సెన్సేషన్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బాహుబలి-2 సెన్సేషన్

తెలుగు సినిమాల వసూళ్ల లెక్కల గురించి చెప్పేటపుడు.. ఫలానా నైజాం అని.. ఆంధ్రా అని.. వైజాగ్ అని.. సీడెడ్ అని ఏరియాల వారీగా కలెక్షన్లు చెబుతుంటాయి. పెద్ద సినిమాలు రిలీజైనపుడు ఆ ఏరియాలో పది కోట్లొచ్చాయి.. ఈ ఏరియాలో 20 కోట్లొచ్చాయి అని లెక్కలు కడుతుంటాం.

జిల్లాల వారీగా కూడా కలెక్షన్లు కోట్లల్లో ఉంటుంటాయి. అలా కాకుండా ఒక సిటీలో.. కొన్ని థియేటర్లలో కలిపి కోట్లల్లో వసూళ్లు రావడం అన్నది అరుదైన విషయం. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు మాత్రమే దక్కిన ఘనత ఇది. ఈ చిత్రం హైదరాబాద్‌లో ఫేమస్ థియేటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అద్భుతమైన రికార్డు సాధించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ‘బాహుబలి-2’ ఆడుతున్న థియేటర్లన్నింటిలో కలిపి ఇప్పటిదాకా రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. ఇక్కడ ‘బాహుబలి-2’ ఐదారు థియేటర్లలో రిలీజైంది. తర్వాత థియేటర్లు తగ్గించారు. మూడు వారం కూడా దేవి.. సుదర్శన్ థియేటర్లలో సినిమాను ఆడించారు. హౌస్ ఫుల్ వసూళ్లతో దుమ్ముదులిపిందీ సినిమా.

ఈ వారాంతంలో ‘కేశవ’ రిలీజవడంతో బాహుబలి-2ను సుదర్శన్‌లో మాత్రమే ఆడిస్తున్నారు. ఐతే అక్కడ ఇప్పటికే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సుదర్శన్‌తో పాటు దేవిలోనూ 4కే డాల్బీ అట్మాస్‌ సౌండ్ సిస్టమ్ ఉండటం... ‘బాహుబలి-2’ లాంటి సినిమాను ఇక్కడ చూస్తే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుండటంతో రెగ్యులర్‌గా క్రాస్ రోడ్స్‌లో సినిమాలు చూసేవాళ్లతో పాటు.. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుండటంతో కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు వచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు