డ్యామేజ్‌ కంట్రోల్‌కి చరణ్‌ టీమ్‌ పాట్లు!

డ్యామేజ్‌ కంట్రోల్‌కి చరణ్‌ టీమ్‌ పాట్లు!

రామ్‌ చరణ్‌ కొత్త సినిమా షెడ్యూల్‌ ఈపాటికి హైదరాబాద్‌లో జరుగుతూ వుండాలి. కానీ ఎండలు తీవ్రంగా వున్నాయనే కారణంగా చరణ్‌ విదేశీ టూర్‌కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం చరణ్‌ లండన్‌లో హాలిడే ఎంజాయ్‌ చేస్తున్నాడు. చరణ్‌ అన్‌ప్రొఫెషనల్‌ ఆటిట్యూడ్‌పై, షూటింగ్స్‌కి సరిగ్గా హాజరు కాడనే దానిపై మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ఈపాటికి సగం పూర్తి కావాల్సిన సుకుమార్‌ సినిమా టాకీ ఇంతవరకు ఇరవై శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఈ చిత్రం ఎప్పటికి పూర్తయి, ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. తన గత చిత్రాల షూటింగ్‌ షెడ్యూల్స్‌ కూడా సజావుగా సాగకపోయే సరికి మీడియాలో ఒక వర్గం చరణ్‌ని టార్గెట్‌ చేస్తోంది.

దీంతో డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయడానికా అన్నట్టు హైదరాబాద్‌లో నాలుగు రోజుల షెడ్యూల్‌ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. రాజమండ్రిలో ఎండల కారణంగా షెడ్యూల్‌ని తామే వాయిదా వేసినట్టు చెప్పారు. జూన్‌ 1 నుంచి రాజమండ్రిలో షూటింగ్‌ మొదలవుతుందని అంటూ, మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌కి అందరూ సహకరించారని నొక్కి వక్కాణించారు.

ఇదంతా మీడియాలో వినిపిస్తోన్న కథనాలకి సమాధానం ఇస్తున్నట్టుగా అనిపిస్తోందని సోషల్‌ మీడియా జనాలు కామెంట్‌ చేస్తున్నారు. ఆగస్టులో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాతలు అంటున్నారంటే, దసరా టైమ్‌కి రెడీ అవుతుందో లేదో అనేది తమకి ప్రస్తుతానికి క్లారిటీ లేనట్టుందని చెవులు కొరుక్కుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు