రామ్‌ చరణ్‌కి ఫుల్‌ ప్యాడింగ్‌

రామ్‌ చరణ్‌కి ఫుల్‌ ప్యాడింగ్‌

రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీస్తోన్న వెరైటీ ప్రేమకథ ఎలా వుంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ, ఈ చిత్రంలో ప్యాడింగ్‌ మాత్రం దిట్టంగా పెడుతున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇందులో కీలక పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రకాష్‌రాజ్‌ కూడా ఈ చిత్ర బృందంలో చేరిపోయాడు. ప్రకాష్‌రాజ్‌ కోసం ఒక విలక్షణమైన పాత్రని సుకుమార్‌ తీర్చిదిద్దాడట. ఈమధ్య కాలంలో ప్రకాష్‌రాజ్‌ చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. ఆయనని మళ్లీ బిజీ చేసేంత సత్తా వున్న ప్రత్యేకమైన పాత్రని సుకుమార్‌ రాసాడట.

అలాగే ఈ చిత్రంలో రావు రమేష్‌, పృధ్వీ కూడా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సాధారణంగా రెగ్యులర్‌ కామెడీకి దూరంగా వుండే సుకుమార్‌ సినిమాలకి భిన్నంగా ఇందులో కామెడీ కంటెంట్‌ చాలా వుంటుందట. అందుకే జబర్దస్త్‌ బ్యాచ్‌లో చాలా మందిని తీసుకున్నట్టు సమాచారం. చరణ్‌, సమంత తొలిసారిగా జంట కడుతోన్న ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో నడిచే ప్రేమకథతో తెరకెక్కుతోంది.

ఇందులో సమంత ధనికుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ వుండగా, చరణ్‌ ఏమో వినికిడి లోపమున్న మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌లో జూన్‌లో గోదావరి తీర ప్రాంతంలో మొదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు