బాహుబలి పేరు చెడగొట్టదు కదా!

బాహుబలి పేరు చెడగొట్టదు కదా!

వి. విజయేంద్రప్రసాద్‌ ఎన్నో హిట్‌ చిత్రాలకి కథలు రాసారు కానీ, 'బాహుబలి' రైటర్‌గానే ఎక్కువ కీర్తి సంపాదించారు. బజరంగి భాయ్‌జాన్‌లాంటి చిత్రాలకి కథలు రాసి రాజమౌళి లేకుండా కూడా బ్లాక్‌బస్టర్లు ఇవ్వగలనని నిరూపించుకున్నా, దర్శకుడిగా మాత్రం ఆయనకి ఎప్పుడూ సక్సెస్‌ దక్కలేదు. శ్రీకృష్ణ 2006, రాజన్న చిత్రాలతో దర్శకుడిగా విఫలమైన విజయేంద్రప్రసాద్‌ 'శ్రీవల్లి' అనే ఎరోటిక్‌ థ్రిల్లర్‌ని తెరకెక్కించారు.

ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రాన్ని బాహుబలి 2 తర్వాత రిలీజ్‌ చేసినట్టయితే క్రేజ్‌ ఎక్కువ వుంటుందని విడుదల వాయిదా వేసారట. బాహుబలి రైటర్‌ తీసిన సినిమాగా మార్కెట్‌ చేసి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీనిని విడుదల చేయాలని చూస్తున్నారు. ట్రెయిలర్స్‌ ఏమాత్రం ఎక్సయిట్‌ చేయని ఈ చిత్రం మేకింగ్‌ వేల్యూస్‌ కూడా చీప్‌గా అనిపిస్తున్నాయి. బాహుబలితో వచ్చిన పేరుని శ్రీవల్లి చెడగొడుతుందా లేక దర్శకుడిగాను విజయేంద్రప్రసాద్‌కి సత్తా వుందని నిరూపిస్తుందా అనేది చూడాలి. ఈ చిత్రం కథ విని రాజమౌళి బాలేదని చెప్పాడట.

 కానీ దర్శకుడిగా ఎలాగైనా తన టాలెంట్‌ చూపించుకోవాలని చూస్తోన్న విజయేంద్రప్రసాద్‌ దీనిని తీయాల్సిందే అని డిసైడ్‌ అయి తీసేసారట. ఫలితం ఏమైనా కానీ బాహుబలితో విజయేంద్రప్రసాద్‌కి పెరిగిన పరపతిని తగ్గించకుండా వుంటే అదే పెద్ద సక్సెస్‌ అనుకోవాలేమో ఇక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు