అరవింద్‌పై రామ్‌ చరణ్‌ ఫాన్స్‌ ప్రెజర్‌

అరవింద్‌పై రామ్‌ చరణ్‌ ఫాన్స్‌ ప్రెజర్‌

రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయమై పదేళ్లవుతోంది. ఇన్నేళ్లలో అతను చేసిన చిత్రాల్లో అత్యుత్తమమైనది మగధీర కాగా, ఇక గుర్తుంచుకోతగ్గ సినిమాలంటూ ఏమీ లేవు. రామ్‌ చరణ్‌ ఈమధ్య వెనకబడిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. మిగతా హీరోలంతా గుర్తుంచుకునే సినిమాలు చేస్తూ వుంటే చరణ్‌ మాత్రం ఇన్‌స్టంట్‌ సక్సెస్‌ వెంట పడ్డాడు. అందుకే చరణ్‌ నుంచి ఒక మెమరబుల్‌ మూవీ రావాలని ఫాన్స్‌ కోరుకుంటున్నారు.

ఈ సమయంలో 'రామాయణం' చిత్రాన్ని అయిదు వందల కోట్ల బడ్జెట్‌తో అల్లు అరవింద్‌ అనౌన్స్‌ చేసేసరికి ఇందులో రాముడి పాత్ర రామ్‌ చరణ్‌కే ఇవ్వాలని ఫాన్స్‌ నుంచి ప్రెజర్‌ ఎక్కువైంది. ఇంకా స్టార్‌ కాస్ట్‌ ఖరారు కాకపోయినా, ఇందులో హీరో రామ్‌ చరణ్‌ అని డిసైడ్‌ చేసేస్తూ ఫాన్స్‌ పోస్టర్స్‌ రెడీ చేసేస్తున్నారు. ఫాన్స్‌ ఏమి చేస్తున్నారనేది చూస్తూనే వున్నా చరణ్‌ కానీ, అల్లు అరవింద్‌ కానీ దీనిపై ఇంకా ఏమీ స్పందించలేదు.

ఇప్పుడు మరో హీరోతో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేస్తే ఫాన్స్‌ ఫీల్‌ అవుతారేమో అనే ఇబ్బంది అరవింద్‌ ఎదుర్కొంటారు. బాహుబలి లాంటి విజయాన్ని త్వరలోనే మెగా ఫ్యామిలీ అందుకోవాలని, చేజారిన ఆధిపత్యాన్ని తిరిగి సాధించాలని ఫాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ టైమ్‌లో వారికి అరవింద్‌ అనౌన్స్‌ చేసిన రామాయణంలో ఆ సత్తా కనిపించడం వల్లే ఈ విధంగా అరవింద్‌పై ఒత్తిడి పెంచుతున్నట్టున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు