మెగా హీరోయిన్‌కి ఏదీ కలిసి రావట్లే

మెగా హీరోయిన్‌కి ఏదీ కలిసి రావట్లే

మెగా ఫ్యామిలీలోని యువ హీరోలకి ఫేవరెట్‌ అయిన రెజీనా కసాండ్రాకి ఈమధ్య ఏదీ కలిసి రావడం లేదు. మంచి నటి అయినప్పటికీ ఎప్పుడూ ద్వితీయ శ్రేణి హీరోయిన్‌గానే మిగిలిన రెజీనా కెరియర్‌లో ఎక్కువ హిట్లు లేవు.

ఈమధ్య కాలంలో ఆమెకి అసలు అదృష్టం కలిసి రావట్లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద టపా కట్టేస్తున్నాయి. రెజీనా కథానాయకిగా నటించిన 'మానగరం' చిత్రం ప్రశంసలు అందుకున్నా ఆర్థికంగా క్లిక్‌ అవలేదు. గత శుక్రవారం విడుదలైన తమిళ చిత్రం 'శరవణన్‌ ఇరుక్క భయమేన్‌' కూడా ఫ్లాప్‌ దిశగా సాగుతోంది.

తెలుగు, హిందీ బాక్సాఫీస్‌లని రూల్‌ చేస్తున్నట్టే తమిళంలోను బాహుబలి హవా కొనసాగుతుండగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం కామెడీతో పాస్‌ అయిపోతుందని అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు.

ప్రస్తుతానికి చేతిలో కొన్ని సినిమాలైతే వున్నాయి కానీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోక ముందే రెజీనా ఎలాగైనా హిట్‌ అవ్వాలి. లేదంటే ఇప్పటికే బలపడిపోతున్న ఐరెన్‌ లెగ్‌ ముద్ర ఆమెని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English