చైతన్యకి ఇష్టంలేదు, కానీ సమంత ఊరుకోదు

చైతన్యకి ఇష్టంలేదు, కానీ సమంత ఊరుకోదు

ఎప్పటికప్పుడు తమ మధ్య వున్న ప్రేమ బంధాన్ని తన ఫాన్స్‌తో పంచుకోవడానికి సమంత ఇష్టపడుతుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండే సమంత తరచుగా చైతన్యతో తన మూమెంట్స్‌ని షేర్‌ చేస్తుంటుంది.

సమంత రెగ్యులర్‌గా పోస్ట్‌ చేస్తున్నా చైతన్య మాత్రం అలాంటివి ఎక్కువగా షేర్‌ చేయడు. ''నా పర్సనల్‌ విషయాలు నా వరకే పరిమితం చేయడం నాకిష్టం. కానీ సమంతకి అలాంటివి పోస్ట్‌ చేయడం ఇష్టం. నేను గుర్తించేలోపే తను ఫోటోలు తీసి నెట్‌లో పెట్టేస్తూ వుంటుంది. తన ఇష్టాన్ని కాదనలేను. అలాగని నా అంతట నేనుగా అవి షేర్‌ చేయలేను'' అని చైతన్య చెప్పాడు.

''మొదట్లో వాటి గురించి ఎవరైనా ప్రస్తావించినపుడు ఇబ్బందిగా వుండేది. కానీ ఇలాంటి మూమెంట్స్‌ అన్నీ ఇలా క్రానికల్‌ చేసుకుంటే తర్వాత వెను తిరిగి చూసుకోవడానికి బాగుంటుంది. ఇప్పటికీ మా గురించి ఎవరు ఏమి అడిగినా నేను అంత చొరవగా మాట్లాడలేను. నవ్వేసి ఊరుకుంటాను'' అని అన్నాడు.

సమంత కోసం చైతన్య వంట చేసి పెట్టడం, ఆమెతో కలిసి విదేశీ టూర్స్‌కి వెళ్లి తనకోసం పూర్తి సమయాన్ని కేటాయించడం లాంటివి చేస్తూ ప్రేమికులకి చైతన్య గోల్స్‌ సెట్‌ చేస్తున్నాడు. తన శైలికి పూర్తి విభిన్నమైన మనస్తత్వమున్నా కానీ సమంత ఇష్టాల్ని కాదనకుండా ప్రేమికుడంటే ఎలా వుండాలో చూపిస్తున్నాడు.