ప్రభాస్‌తో చేయడానికి 8 కోట్లు అడిగిందా?

ప్రభాస్‌తో చేయడానికి 8 కోట్లు అడిగిందా?

బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటించబోతున్న 'సాహో' చిత్రానికి ఇంకా హీరోయిన్‌ ఖరారు కాలేదనే సంగతి తెలిసిందే. ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయాలని చూస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందనేది మేకర్స్‌ ఫీలింగ్‌.

అందుకే పలువురు బాలీవుడ్‌ తారలని వారు కాంటాక్ట్‌ చేస్తున్నారు. బాహుబలి హీరోతో నటించడానికి బాలీవుడ్‌ హీరోయిన్లు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని అనుకుంటే, అక్కడి వారు అంత ఆసక్తి చూపించకపోవడం సాహో మేకర్స్‌కి షాక్‌ ఇచ్చింది. శ్రద్ధ కపూర్‌ అయితే నటించడానికి ఓకే చెప్పినా కానీ ఎనిమిది కోట్ల పారితోషికం అడిగిందట. ప్రస్తుతం హిట్లే లేని శ్రద్ధ కపూర్‌కి బాలీవుడ్‌ చిత్రాలకే మూడు కోట్లు ఇవ్వరు.

అలాంటిది ప్రభాస్‌తో నటించాలంటే ఎనిమిది కావాలందట. దాంతో నిర్మాతలు షాక్‌ తిని ఆమెతో బేరాలాడే పని కూడా పెట్టుకోలేదనేది బాలీవుడ్‌ మీడియా టాక్‌. అలాగే 'లోఫర్‌'లో నటించిన దిషా పటానీ 'సాహో' కోసం అయిదు కోట్లు అడిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ధోని' చిత్రంలో చిన్న క్యారెక్టర్‌ మినహా ఆమెకంటూ మరో చెప్పుకోతగ్గ సినిమానే లేదు. తను కూడా అయిదు కోట్లు అడిగిందంటే ఏమనుకోవాలిక? ద్వితీయ శ్రేణి హీరోయిన్లే ఇలా అడుగుతుంటే ఇక బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు ఎంత అడుగుతారో ఏమో? పూజ హెగ్డే, క్రితి సనన్‌లలో ఎవరో ఒకరిని ఖరారు చేస్తారని, వారిద్దరే రీజనబుల్‌ అమౌంట్‌ కోట్‌ చేసారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English