బన్నీ సినిమాపై ఆ హీరోకేంటి అంత ఇంట్రెస్ట్

బన్నీ సినిమాపై ఆ హీరోకేంటి అంత ఇంట్రెస్ట్

ఇంకా ప్రారంభోత్సవమే జరుపుకోని ఓ తెలుగు సినిమాపై బాలీవుడ్ అగ్ర హీరో.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థ విపరీతమైన ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’లో నటిస్తున్న అల్లు అర్జున్.. దీని తర్వాత రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. జీ స్టూడియోస్ వాళ్లతో కలిసి ప్రయత్నం చేస్తుండటం విశేషం. తెలుగుతో పాటు హిందీ.. మలయాళం డబ్బింగ్ వెర్షన్లను కూడా కలుపుకుని మొత్తంగా రూ.24 కోట్లకు శాటిలైట్ డీల్‌ జరిగినట్లు.. అజయ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ బాలీవుడ్ హీరో ఇలా ఓ తెలుగు హీరో సినిమాపై ఇంత ఆసక్తి చూపించడం.. మూడు భాషలకు కలిపి శాటిలైట్ రైట్స్ తీసుకోవడం అన్నది ఊహకందని విషయం. గత కొన్నేళ్లలో బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అతడి సినిమాలు మలయాళంలో కూడా ఇరగాడేస్తున్నాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్లకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాను హిందీలోకి అనువాదం చేస్తే.. అది యూట్యూబ్‌లో కోట్లల్లో వ్యూస్ తెచ్చుకుంటోంది. టీవీలో రిలీజ్ చేసినా రెస్పాన్స్ బాగుంది. ‘దువ్వాడ జగన్నాథం’ శాటిలైట్ హక్కుల్ని ఓ హిందీ ఛానెల్ రూ.7 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. ‘నా పేరు సూర్య’కు సంబంధించి మూడు భాషల హక్కుల్ని గుంపగుత్తగా కొనేసి.. ఆ తర్వాత ఆయా వెర్షన్లను మారు బేరానికి లోకల్ ఛానెల్‌కు అమ్ముకునే ఆలోచనలో ఉన్నట్లున్నాడు అజయ్ దేవగన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు