ఇక్కడ పవన్‌, రేణు... అక్కడ అతడు, ఆమె

ఇక్కడ పవన్‌, రేణు... అక్కడ అతడు, ఆమె

విడాకులు తీసుకుని విడిపోవడమంటే ఇక మళ్లీ జీవితంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా వుండక్కర్లేదని, పిల్లల కోసం విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కొనసాగవచ్చని, పిల్లల ఆనందం కోసం తరచుగా కలుస్తూ వారికి తల్లిదండ్రులతో సమయం గడిపిన ఆనందాన్ని పంచి ఇవ్వవచ్చునని పవన్‌కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ చూపెడుతున్నారు.

పవన్‌కి మళ్లీ పెళ్లయి, పాప వున్నప్పటికీ రేణుతో వుంటోన్న తన పిల్లలతో తరచుగా సమయం గడిపి వస్తుంటాడు. వారి పుట్టినరోజులతో పాటు స్కూల్లో ఈవెంట్స్‌కి కూడా హాజరయి తండ్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తుంటాడు. అలాగే వారి భవిష్యత్తుకి సంబంధించిన అన్ని జాగ్రత్తలను కూడా పవన్‌ తీసుకుంటున్నాడు. ఇక్కడ విడిపోయిన భార్యాభర్తలు తల్లిదండ్రులుగా బాధ్యతలు ఎలా నిర్వర్తించవచ్చుననేది పవన్‌, రేణు చూపిస్తోంటే, బాలీవుడ్‌ జంట హృతిక్‌ రోషన్‌, సుసానే ఖాన్‌ కూడా విడిపోయిన జంటలకి దిశానిర్దేశం చేస్తున్నారు.

అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయినప్పటికీ, కుటుంబానికి చెందిన పార్టీలు, ఫంక్షన్లకి ఇద్దరూ హాజరవుతున్నారు. అలాగే తరచుగా పిల్లల్ని బయటకి తీసుకెళ్తూ తల్లిదండ్రులిద్దరూ కలిసి లేని లోటు తీరుస్తున్నారు. తాజాగా వీరిద్దరూ ఒక డిన్నర్‌ మీట్‌లో కలుసుకున్నారు. ఈ మీట్‌కి హృతిక్‌ తండ్రి, స్నేహితులు కూడా హాజరయ్యారు. అయితే పవన్‌ మాదిరిగా ఇంకా హృతిక్‌ పెళ్లి చేసుకోకపోవడంతో ఈ జంట మళ్లీ ఒకటవుతారేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ హృతిక్‌ మాత్రం తన లైఫ్‌లో ఇక పెళ్లికి, ఫ్యామిలీ లైఫ్‌కి చోటు లేదని చాలా సార్లు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు