బన్నీ హీరోయిన్‌ కోసం ప్రభాస్‌ ఆరా!

బన్నీ హీరోయిన్‌ కోసం ప్రభాస్‌ ఆరా!

ప్రభాస్‌తో 'సాహో' చిత్రానికి యువి క్రియేషన్స్‌ శ్రీకారం చుట్టి చాలా కాలమవుతోంది. టీజర్‌ కూడా షూట్‌ చేసిన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అయితే ఇంకా మొదలు కాలేదు. ఈ చిత్రాన్ని బాహుబలి మాదిరిగా నేషనల్‌ వైడ్‌గా మార్కెట్‌ చేయడానికి నిర్మాతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.

అందుకే టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ నేషనల్‌ అప్పీల్‌ వున్న వారయితే బాగుంటుందని చూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌ విషయంలో రాజీ పడడానికి ఇష్టపడడం లేదు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు కానీ అక్కడి టాప్‌ హీరోయిన్లంతా బిజీగా వున్నారు. దీంతో పూజా హెగ్డే పేరు పరిశీలనకి వచ్చింది. మొహంజుదారో చిత్రంతో పూజ బాలీవుడ్‌ని ఆకర్షించింది. ఇంకా అక్కడ బ్రేక్‌ రాకపోయినప్పటికీ పూజ ఆల్రెడీ బాలీవుడ్‌ ఫ్రెటర్నిటీలో బాగా కలిసిపోయింది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథమ్‌ చేస్తోన్న ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రభాస్‌ పక్కన బాగుంటుంది. పూజ కంటే బెటర్‌ ఆప్షన్‌ దొరుకుతుందేమోనని ఇంకా చూస్తున్నారు కానీ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎవరూ దొరకని పక్షంలో పూజతోనే 'సాహో' మొదలయ్యే అవకాశాలున్నాయి. బాహుబలితో నటించే అదృష్టం పూజని వరిస్తుందో లేదో కొద్ది రోజుల్లో తేలిపోతుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English