కరణ్ జోహార్ చెప్పిందంతా అబద్ధమా?

కరణ్ జోహార్ చెప్పిందంతా అబద్ధమా?

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాల మయమే. తన సెక్సువల్ లైఫ్ గురించి ఆయన ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు.. రాసిన వ్యాసాలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. తాజాగా కరణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. స్వయంగా కరణ్ కుటుంబ సభ్యులే అతడిపై న్యాయ పోరాటం చేయబోతుండటం విశేషం.

ఇందుకు కరణ్ రాసిన ‘యాన్ అన్ సూటబుల్ బాయ్’ పుస్తకమే కారణణం. ఇది.. కరణ్ ఆటో బయోగ్రఫీ. ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. దీని కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఐతే ఈ పుస్తకంలో కరణ్ అబద్ధాలు రాశాడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తన కుటుంబంలో తన తండ్రి తప్ప పెద్దగా చదువుకున్నవాళ్లెవ్వరూ లేరని.. తమ కుటుంబంలో పెద్దవాళ్లందరూ కలిసి స్వీట్ షాప్ నడిపేవాళ్లని.. తన తండ్రి చదువుకోవడం వల్ల షాపు సేల్స్ కౌంటర్లో కూర్చునేవాడని.. ఆ తర్వాత ఆ పని వదిలేసి బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి నిర్మాతగా ఎదిగాడని కరణ్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.

ఐతే కరణ్ చెప్పిందంతా అబద్ధమంటూ అతడి కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం ఇచ్చారు. కరణ్ పెదనాన్న అయిన వేద్ ప్రకాష్ జోహార్ కొలంబియా యూనివర్శిటీలో జర్నలిజం గ్రాడ్యుయేషన్ చేశారట. మరొకరు ఇండియన్ ఆర్మీలో పని చేశారు. కరణ్ అత్తయ్య స్కూల్లో టీచర్‌గా పని చేశారట.

కరణ్ తన గురించి.. తన తండ్రి గురించి గొప్పలు చెప్పుకునే క్రమంలో తమ గురించి తక్కువ చేసి చూపాడంటూ వీళ్లందరూ అతడిపై మండి పడుతున్నారు. దీనిపై వాళ్లు కరణ్‌కు లీగల్ నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు