చైతన్య సినిమాకి పిచ్చ క్రేజ్‌

చైతన్య సినిమాకి పిచ్చ క్రేజ్‌

'రారండోయ్‌ వేడుక చూద్దాం' ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి బిజినెస్‌ ఎంక్వయిరీలు ఎక్కువై పోయాయట. తెలుగు వారికి నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని ప్యాక్‌ చేసారనేది ట్రెయిలర్‌ చూస్తే తెలుస్తోంది. నిన్నే పెళ్లాడతా తరహా ఫ్యామిలీస్‌ మెచ్చే ప్రేమకథ వచ్చి చాలా కాలమవుతోంది.

బాహుబలి 2 మూడ్‌ నుంచి ప్రేక్షకులని తప్పించి, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదకి మళ్లించే సత్తా ఈ చిత్రానికి వుందని ట్రెయిలర్‌ చూసి చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. సోగ్గాడే చిన్నినాయనాతో రూరల్‌ కామెడీ బాగా తీయగలనని, మాస్‌ పల్స్‌ తెలుసునని చాటుకున్న కళ్యాణ్‌కృష్ణ ఈ సినిమా ట్రెయిలర్‌తో తాను ఒక్క సినిమా వండర్‌ కాదనిపించుకున్నాడు. చైతన్య ఇంత ఈజ్‌తో కనిపించడం అభిమానుల్నే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అలాగే యాక్టింగ్‌ రాదని కామెంట్స్‌ ఎదుర్కొనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం పల్లెటూరి యువతి పాత్రలో చాలా చక్కగా ఇమిడిపోయింది. ఇక దేవిశ్రీప్రసాద్‌ పాటలు వుండనే వున్నాయి కనుక ఈ చిత్రం ట్రాక్‌ తప్పే అవకాశమే లేదనిపిస్తోంది. ట్రేడ్‌ వర్గాల నుంచి ఎంక్వయిరీలు, థర్డ్‌ పార్టీల నుంచి పెరిగిన ఆఫర్లు ఈ చిత్రంపై ట్రెయిలర్‌ ఎంత నమ్మకం పెంచిందనేది తెలియజేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు