బాహుబలి క్రేజ్‌ ఆయన వాడేసుకుంటున్నాడు

బాహుబలి క్రేజ్‌ ఆయన వాడేసుకుంటున్నాడు

బాహుబలి చిత్రం రాజమౌళి సృష్టి అయినప్పటికీ, ఆ కథకి బీజం వేసింది విజయేంద్రప్రసాద్‌ కావడంతో రైటర్‌గా ఆయన పరపతి బాగా పెరిగింది. అంతకుముందే బజరంగి భాయ్‌జాన్‌తో బాలీవుడ్‌లో కూడా సక్సెస్‌ అయిన విజయేంద్రప్రసాద్‌ 'బాహుబలి'కి వచ్చిన క్రేజ్‌ని పూర్తి స్థాయిలో క్యాష్‌ చేసుకుంటున్నారు.

కంగన రనౌత్‌తో క్రిష్‌ తెరకెక్కిస్తోన్న 'మణికర్నిక' చిత్రానికి ఏరి కోరి బాహుబలి రైటర్‌నే పెట్టుకున్నారు. అలాగే బాలీవుడ్‌లో పలువురు అగ్ర హీరోలు విజయేంద్రప్రసాద్‌ కథల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త కథలు రాయకుండా, ఆల్రెడీ వున్న కథలనే ఇంకో రకంగా రాసివ్వడం విజయేంద్రప్రసాద్‌ ప్రత్యేకత. దీని వల్ల ఆయన మిగతా వారి కంటే ఎక్కువ కథలు రాయగలుగుతున్నారు.

కాపీ కథలతో పాటు ఆల్రెడీ విజయవంతమైన చిత్రాలకి సీక్వెల్స్‌ రాస్తే ఎలాగుంటుందనే ఆలోచన ఆయనకి వచ్చింది. అందుకే ఒకే ఒక్కడు, విక్రమార్కుడు చిత్రాలకి సీక్వెల్స్‌ రాయబోతున్నారు. ఈ రెండు చిత్రాలు హిందీలోకి కూడా రీమేక్‌ అయ్యాయి కనుక తన సీక్వెల్స్‌తో హిందీ మార్కెట్‌ని ఆయన టార్గెట్‌ చేస్తున్నారు. ఇంకా వీటిలో హీరోలెవరు, ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియదు కానీ విజయేంద్రప్రసాద్‌ వీటికి కథలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు