పల్నాటి పౌరుషం చూపిస్తాడా?

పల్నాటి పౌరుషం చూపిస్తాడా?

`పందెం కోడి` సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ని సృష్టించుకున్నాడు  విశాల్. స్వతహాగా తెలుగువాడైన ఈ కథానాయకుడు తమిళంలో స్థిరపడ్డాడు. తాను నటించే ప్రతి సినిమానీ  తెలుగులో విడుదల చేసుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవల మాత్రం విశాల్ కి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోను పరాభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన సొంతంగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతొ ఓ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు.

సుసీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. అది తెలుగులో `పల్నాడు` పేరుతో విడుదలవుతోంది. ఇందులో విశాల్ సరసన లక్ష్మీ మీనన్ కథానాయికగా నటించింది. `గజరాజు` సినిమాతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్. `నా పేరు శివ` సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు సుసీంద్రన్. మంచి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాల మధ్య విడుదలవుతోంది. ఇందులో విశాల్ పల్నాటి కుర్రాడిగా కనిపిస్తాడు. తెలుగు తమిళ భాషల్లో విశాల్ కి కీలకమైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు