కుర్రోడి రేంజ్‌ బాగా పెరిగింది

 కుర్రోడి రేంజ్‌ బాగా పెరిగింది

శర్వానంద్‌ సినిమాలు బాగున్నాయనే టాక్‌ వచ్చినా కానీ జనం చూసేవారు కాదు. ప్రస్థానం లాంటి చిత్రం కమర్షియల్‌గా ఫ్లాప్‌ కాగా, శర్వానంద్‌ నటించిన చాలా మంచి చిత్రాలు ఆర్థికంగా గట్టెక్కలేకపోయాయి. అయితే ఒక్కసారి టైమ్‌ కలిసి వస్తే అన్నీ సెట్‌ అవుతాయని, రన్‌ రాజా రన్‌ నుంచి శర్వానంద్‌ దూసుకుపోతున్నాడు.

శతమానం భవతితో ఫ్యామిలీ ఆడియన్స్‌లో శర్వానంద్‌కి చాలా ఫాలోయింగ్‌ వచ్చింది. అది ఇప్పుడు రాధ వసూళ్లపై రిఫ్లెక్ట్‌ అవుతోంది. శర్వానంద్‌ చిత్రాల్లోనే రాధకి బెస్ట్‌ ఓపెనింగ్‌ వచ్చింది. సిటీల్లోనే కాకుండా చిన్న చిన్న టౌన్స్‌లో కూడా రాధ ఓపెనింగ్స్‌ బాగుండడంతో అతని రేంజ్‌ పెరిగిందని ట్రేడ్‌ అంగీకరిస్తోంది.

శర్వానంద్‌ చిత్రాల్లోనే బెస్ట్‌ ఓపెనింగ్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి టాక్‌ కూడా అంత గొప్పగా రాలేదు. అయినప్పటికీ వసూళ్ల పరంగా రాధ సత్తా చాటుకోవడం చూస్తే శర్వానంద్‌పై ఆడియన్స్‌కి నమ్మకం బాగా పెరిగిందనే సంగతి స్పష్టమవుతోంది.

నాని తర్వాత యువ హీరోల్లో శర్వానంద్‌ ఒకడే క్లాస్‌ ఆడియన్స్‌ ప్లస్‌ యూత్‌లో గ్యారెంటీ ఆడియన్స్‌ని సాధించాడు. అయితే ఈ జోరు ఇలాగే కొనసాగాలంటే శర్వానంద్‌ తను చేసే కొత్త రకం కథలని చేస్తుండాలి. రాధ లాంటి రొటీన్‌ చిత్రాలు రెండు, మూడు వరుసగా వస్తే ఈ నమ్మకం కోల్పోయే ప్రమాదముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు