రాజమౌళి దీనిని వదిలేస్తే పిచ్చితనమే!

రాజమౌళి దీనిని వదిలేస్తే పిచ్చితనమే!

'బాహుబలి' అనేది ఇప్పుడెంతటి బ్రాండ్‌ అంటే, బాహుబలి 3 అంటూ వస్తే ఈసారి ఇంటర్నేషనల్‌ మార్కెట్స్‌ కూడా దానిపై ఆసక్తి చూపిస్తాయి. బాహుబలి 2 చేసిన సంచలనాలతో ఇంటర్నేషనల్‌ మీడియాలో బాహుబలికి ఫుల్‌ కవరేజ్‌ దక్కింది.

మొదటి భాగం వల్ల రెండవ భాగానికి ఎంతగా కలిసి వచ్చిందో, ఇండియా వైడ్‌గా అంతటి సంచలనం ఎలా అయిందో, అదే విధంగా మరో భాగం వస్తే ఈసారి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో బాహుబలి సంచలనాలు పెద్ద స్థాయిలో వుంటాయి. ఇండియన్‌ సినిమా అంటే బాహుబలి అనే రీతిన దీనికి బ్రాండింగ్‌ లభించింది. సాధారణంగా ఇంత బ్రాండ్‌ బిల్డ్‌ అయిన తర్వాత ఎవరూ దానిని పక్కన పడేయరు. ఒక చిత్రం అమితంగా క్లిక్‌ అయిన తర్వాత దానిని ఫ్రాంచైజీగా మార్చేస్తారు. హాలీవుడ్‌లో ఇలాంటి ఫ్రాంచైజీలు కోకొల్లలు. కొన్నిట్లో ఏడు, కొన్నిట్లో అంతకుమించి కూడా సినిమాలు తీసారు.

అలాగే బాహుబలిని రాజమౌళి కంటిన్యూ చేయాలని సినీ పండితులు అంటున్నారు. ఇంత బ్రాండ్‌ బిల్డ్‌ అయిన తర్వాత దీనిని పక్కన పడేస్తే పిచ్చితనం అవుతుందని, అందుకే ఈ బ్రాండ్‌ చుట్టూ కొత్త కథలు అల్లాలని, దీనిపై మరో రెండు, మూడు సినిమాలైనా తీసి, ఈ బ్రాండ్‌ వేల్యూని క్యాష్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాజమౌళి టీమ్‌ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నట్టే అనిపిస్తోంది. బాహుబలి 3పై రాజమౌళితో పాటు విజయేంద్రప్రసాద్‌ కూడా హింట్స్‌ ఇస్తున్నారు. త్వరలోనే వీరు ఒక నిర్ణయం తీసుకుని కొత్త బాహుబలి అనౌన్స్‌మెంట్‌తో వస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు