పవన్‌కళ్యాణ్‌ చేస్తే కనుక బ్లండరే

పవన్‌కళ్యాణ్‌ చేస్తే కనుక బ్లండరే

త్రివిక్రమ్‌తో మాత్రమే సినిమాలు తీసే హారిక హాసిని సంస్థ ఒక హిందీ చిత్రం రీమేక్‌ రైట్స్‌ తీసుకోవడం ఆశ్చర్యపరచింది. బహుశా వారి సిస్టర్‌ కన్సర్న్‌ బ్యానర్‌ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కోసం ఈ రైట్స్‌ తీసుకున్నారేమో అనుకున్నారు. అయితే ఒక భారీ ప్రణాళికలో భాగంగానే ఈ రైట్స్‌ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్‌, త్రివిక్రమ్‌తో సినిమా నిర్మిస్తున్న హారిక హాసిని సంస్థ, బాలీవుడ్‌ హిట్‌ 'జాలీ ఎల్‌ఎల్‌బి 2'పై పవన్‌కళ్యాణ్‌ ఆసక్తి చూపించడంతో రైట్స్‌ తీసుకున్నారని, పవన్‌ సై అంటే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించడానికి వారు సంసిద్ధమని తెలిసింది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్రివిక్రమ్‌తో తప్ప వేరే దర్శకులతో చేయడానికి ఇష్టపడని నిర్మాత రాధాకృష్ణ ఆ బ్రాండ్‌ తొలగించుకోవడానికి పవన్‌కళ్యాణ్‌ సినిమాతో వేరే దర్శకుడిని సంప్రదిస్తారేమో చూడాలి. అయితే జాలీ ఎల్‌ఎల్‌బి 2 చిత్రాన్ని పవన్‌ రీమేక్‌ చేస్తాడనేది ఫాన్స్‌కి నచ్చడం లేదు.

చాలా సాధారణ కథ వున్న ఆ చిత్రం పవన్‌లాంటి పెద్ద స్టార్‌కి సూట్‌ అయ్యే మెటీరియల్‌ కాదు. ఒకవేళ పవన్‌ ఈ రీమేక్‌ తలపెడితే అది పెద్ద బ్లండర్‌ అవుతుందని సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. వేగంగా నాలుగైదు చిత్రాలు చేద్దామని చూస్తోన్న పవన్‌ ఒరిజినల్‌ సబ్జెక్ట్స్‌ కంటే రీమేక్స్‌ మీదే మొగ్గు చూపుతున్నాడు. అయితే రీమేక్స్‌ అయినా హీరోయిజం వున్న మాస్‌ సినిమాలు చేస్తే బెటర్‌ అనేది ఫాన్స్‌ ఫీలింగ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు