ఆ రీమేక్‌లో నటించేది పవన్ కళ్యాణా?

ఆ రీమేక్‌లో నటించేది పవన్ కళ్యాణా?

ఈ ఏడాది హిందీలో సూపర్ హిట్టయిన చిత్రాల్లో ‘జాలీ ఎల్ఎల్బీ-2’ ఒకటి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా విమర్శల ప్రశంసలందుకుంది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లు కూడా సాధించింది. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ‘జాలీ ఎల్ఎల్బీ-2’ రీమేక్ హక్కుల్ని మంచి రేటు ఇచ్చి తీసుకుంది. ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే నిజానికి ఈ సినిమా రీమేక్ హక్కుల్ని కొన్నది వెంకీ కోసం కాదట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జాలీ ఎల్ఎల్బీ-2’ రీమేక్‌లో నటించబోతున్నాడన్నది తాజా సమాచారం. రీమేక్ హక్కులు కొనడంలో ఆయన ప్రోద్బలం కూడా ఉందని సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడట. ‘లవ్ ఆజ్ కల్’ను ‘తీన్ మార్’గా తెలుగులోకి మార్చడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ రీమేక్‌కు కూడా తన సహకారం అందిస్తాడని సమాచారం.

ఆయన స్క్రిప్టులో మార్పులు చేయడంతో పాటు మాటలు కూడా రాస్తాడట. మరో దర్శకుడు పవన్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. బహుశా అది డాలీనే అయినా ఆశ్చర్యం లేదేమో. అతను రీమేక్ సినిమాలైన ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’లకు పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ నడుస్తోంద.ి త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు