ఇళయరాజా వెర్సస్ బాలు.. మణిశర్మ వెర్షన్ ఇది

ఇళయరాజా వెర్సస్ బాలు.. మణిశర్మ వెర్షన్ ఇది

ఓవైపు ఇళయరాజా.. మరోవైపు బాలుసుబ్రమణ్యం.. ఇద్దరూ దిగ్గజాలే. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనడానికేమీ లేదు. ఎవరి స్థాయిలో వాళ్లు గొప్పవాళ్లే. మంచి మిత్రులు కూడా అయిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య విభేదాలు తలెత్తుతాయని ఎవ్వరూ అనుకోలేదు.

తన పాటల్ని కచేరీల్లో ఉపయోగించుకుంటున్నందుకు ఇళయరాజా బాలుకు నోటీసులివ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ఇళయరాజాది తప్పంటే.. ఇంకొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. మరి ఇళయరాజా, బాలు ఇద్దరితోనూ పని చేసిన సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ.. ఈ విషయంలో ఎవరి వైపు నిలుస్తారు.. ఈ వివాదంపై ఆయన అభిప్రాయమేంటి.. తెలుసుకుందాం పదండి.

‘‘కాపీ రైట్స్‌ విషయంలో రాజా గారికి, బాలు గారికి జరిగిన యుద్దంపై మూడో వ్యక్తి కామెంట్‌ చేసే అర్హత లేదు. ఇద్దరు దిగ్గజాలకు సంబంధించిన గొడవ అది. ఈ సమస్య సంగీతానికి సంబంధించిందే అయినా విషయం అందరికీ సంబంధించింది. ఐతే మా గురువు గారైన ఇళయరాజా గారు 20 ఏళ్ల కిందటే ఈ ఇష్యూను లేవదీయాల్సింది. అలా చేసి ఉంటే ఆయనకు చాలా డబ్బులొచ్చి ఉండేవి. ఇప్పుడు ఆయన రాయల్టీ కోసం నోటీసులు ఇవ్వడంతో కొందరు గాయుకలు మరి మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఆ మ్యూజిక్‌ తయారు చేయడం వెనుక రాజా గారి కృషి ఎంత ఉందో ఆయన శిష్యుడైన నాకు తెలుసు. ఆయన సంగీతం చేసిన ప్రతి పాట ఆ మహా రుషికి చెందినదే. ఒక పాట అనుకున్నాక ఫలానా సింగర్‌ అని ఫిక్స్‌ చేసేది సంగీత దర్శకుడే కదా. అప్పట్లో ఆడియో హక్కులు అన్నీ కూడా ఇళయరాజా గారి సొంత కంపెనీ మీదే ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియడం లేదు’’ అంటూ ఇళయరాజా రాయల్టీ అడగడం కరెక్టే అన్న ఉద్దేశాన్ని వ్యక్త పరిచాడు మణిశర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు